Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | రికార్డు సృష్టించిన యూఏఈ స్పిన్నర్.. అయినా శ్రీలంక చేతిలో ఓటమి...

T20 world cup | రికార్డు సృష్టించిన యూఏఈ స్పిన్నర్.. అయినా శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు

T20 world cup | టీ20 వరల్డ్ కప్ లో రికార్డులు నమోదవుతున్నాయి. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై నమీబియా గెలిచి సంచలనం నమోదు చేయగా.. రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ ను స్కాంట్లాడ్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మేయ్యప్పన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

టీ20 ప్రపంచకప్ 2022లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా, ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా మేయప్పన్ రికార్డు నమోదు చేశాడు. అంతకుముందు బ్రెట్ లీ, క్యాంఫర్, వనిందు హసరంగా, రబడా హ్యాట్రిక్ వికెట్లు తీశారు.

Read more : T20 world cup | తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. పసికూన నమీబియా చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక

మేయ్యప్పన్ హ్యాట్రిక్ వికెట్లు తీసినా శ్రీలంకదే పైచేయి అయింది. తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓడిన శ్రీలంక.. జాగ్రత్త ఆడింది. యూఏఈపై 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 152 పరుగులు చేసింది. నిస్సనక (74), ధనంజయ డిసిల్వ (33) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్ మేయప్పన్ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. 15వ ఓవర్లో వరుస బంతుల్లో రాజకపక్స, అసలంక, దసున్ శనకను ఔట్ చేసి.. యూఏఈ తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

Read more: Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

153 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన యూఏఈ 17.1 ఓవర్లలో 73 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు సమష్ఠిగా రాణించడంతో ఈ టోర్నీలో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో హసరం 8 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా.. చమీర 15 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తీక్షణ 15 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

గత రికార్డులు

  • టీ20ల్లో ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ హసరంగ. శ్రీలంక బౌలర్‌ 2012 ప్రపంచకప్‌లో మొత్తంగా 16 వికెట్లు తీశాడు. మరోవైపు బౌలర్లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అజంతా మెండిస్‌ (శ్రీలంక) రికార్డుల్లోకి ఎక్కాడు. 2012లో వెస్టిండిస్‌పై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
  • టీ20 ప్రపంచకప్‌లో అత్యంత చెత్త రికార్డు నెదర్లాండ్స్‌ జట్టుదే. ఎందుకంటే.. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులకే చాపచుట్టేసింది. అంతేకాదు గత సీజన్‌ 2021లోనూ శ్రీలంకపైన మరోసారి 44 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెండు సార్లు శ్రీలంకపైనే స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీ20 చరిత్రలో నెదర్లాండ్స్ నిలిచిపోయింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News