Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup | వెస్టిండీస్ ఆశలు సజీవం.. జింబాబ్వేపై 31 పరుగుల తేడాతో విజయం

T20 world cup | వెస్టిండీస్ ఆశలు సజీవం.. జింబాబ్వేపై 31 పరుగుల తేడాతో విజయం

T20 world cup | జింబాబ్వేపై మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ విజయం సాధించి టీ20 ప్రపంచకప్ సూపర్ 12 ఆశలను నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ కు జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జింబాబ్వే పై జరిగిన మ్యాచ్ లో 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. నిర్ణీణ 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. చార్లెస్ 45 పరుగులు, పావెల్ 28, అఖిల్ హుస్సేన్ 23 పరుగులతో రాణించారు. దీంతో భారీ స్కోరు చేయగలిగింది. సికందర్ రాజా 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.

Read More : T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

అటు 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే ఆశలను అల్జారి జోసెఫ్ అడియాసలు చేశాడు. 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి విండీస్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ నడ్డి విరిచిన అల్జారి జోసెఫ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read more: T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

జింబాబ్వే పవర్ ప్లే ముగిసే సరికి 55 పరుగులు చేసినా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. స్కాట్లాండ్ తో ఓటమి తర్వాత చావో రేవో అన్న పరిస్థితుల్లో జింబాంబ్వేపై వెస్టిండీస్ విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది.

ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో రాణించిన వెస్టిండీస్, బ్యాటింగ్ లో మాత్రం తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విండీస్ మూడో ఓవర్లోనే ఓపెనర్ మేయర్స్ వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ చార్లెస్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 9 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 74 పరుగులతో నిలిచిన వెస్టిండీస్ భారీ స్కోరు చేస్తుందని అందరూ భావించారు. కానీ జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. చివర్లో పావెల్, అఖీల్ ఏడో వికెట్ కు 49 పరుగులు జోడించడంతో 153 పరుగులు చేయగలిగింది.

రెండు సార్లు విశ్వ విజేత

వెస్టిండీస్ గతంలో రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచింది. 2012 టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంకపై విజయం సాధించి పొట్టి క్రికెట్ లో మొదటి సారి విశ్వ విజేతగా నిలిచింది. 2016లో మరోసారి ఇంగ్లండ్ పై విజయం సాధించి కప్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో అందరూ ఇంగ్లండ్ నే గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివరి నాలుగు బంతుల్లో 4 సిక్సులు కొట్టి అనూహ్య విజయం సాధించింది.

Follow Us : FacebookTwitter

Read more articles | T20 world cup | రెండు సార్లు ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ కు షాకిచ్చిన స్కాట్లండ్

T20 world cup | రికార్డు సృష్టించిన యూఏఈ స్పిన్నర్.. అయినా శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News