Saturday, July 13, 2024
- Advertisment -
HomeLatest NewsT20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు...

T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

T20 world cup records | టీ 20 ప్రపంచకప్‌ 2007లో మొదలైనప్పటి నుంచి జరిగిన ఏడు సీజన్లలో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇంతకీ ఎవరెవరు ఏ రికార్డు సృష్టించారు ? ఇప్పటివరకు ఎంత మంది బ్యాటర్లు సెంచరీలు సాధించారు ? అత్యధికంగా అర్థ సెంచరీలు చేసిన బ్యాటర్‌ ఎవరు? అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ ఎవరు ? భారీ స్కోరు సాధించిన జట్టు ఏది తెలుసా.. ఇదిగో ఆ వివరాలు తెలుసుకోండి.. జ్ఞాపకాలను నెమరేసుకోండి.

  • ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ మొదలైనప్పటి నుంచి అత్యధిక స్కోరు సాధించిన జట్టు శ్రీలంక. టోర్నీ మొదలైన ఏడాదే అంటే 2007లో కెన్యాపై శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఇదే ఇప్పటివరకు టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యధిక స్కోరు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.
  • టీ20 ప్రపంచకప్‌లో అత్యంత చెత్త రికార్డు నెదర్లాండ్స్‌ జట్టుదే. ఎందుకంటే.. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగులకే చాపచుట్టేసింది. అంతేకాదు గత సీజన్‌ 2021లోనూ శ్రీలంకపైన మరోసారి 44 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెండు సార్లు శ్రీలంకపైనే స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయిన జట్టుగా టీ20 చరిత్రలో నెదర్లాండ్స్ నిలిచిపోయింది.
  • వన్డేల్లో సెంచరీ చేయడం అంటే ఓకే.. కానీ టీ20లో సెంచరీ చేయడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది.. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 9 సెంచరీలు నమోదకావడం విశేషం. వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ రెండుసార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ఒకసారి 117 పరుగులు, మరోసారి 100 పరుగులు చేశాడు.
  • భారత్‌ తరఫున టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి సెంచరీ చేసిన ఆటగాడు సురేశ్‌ రైనా ఒక్కరే.
  • కివీస్ ఆటగాడు వ్యక్తిగతంగా అత్యధికంగా 123 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వీరితో పాటు మహేల జయవర్దనె, తమిమ్‌ ఇక్బాల్‌, జోస్‌ బట్లర్‌, అమ్మద్‌ షెహ్‌జాద్‌, అలెక్స్‌ హేల్స్‌లు సెంచరీలు నమోదు చేశారు.
  • టీ20ల్లో ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ హసరంగ. శ్రీలంక బౌలర్‌ 2012 ప్రపంచకప్‌లో మొత్తంగా 16 వికెట్లు తీశాడు. మరోవైపు బౌలర్లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అజంతా మెండిస్‌ (శ్రీలంక) రికార్డుల్లోకి ఎక్కాడు. 2012లో వెస్టిండిస్‌పై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.
  • ఏడు సీజన్లలో కలిపి బంగ్లాదేశ్‌ బౌలర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (41) అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు.
  • ఏడు సీజన్లలో నలుగురు హాట్రిక్‌ వికెట్లను పడగొట్టారు. బ్రెట్‌ లీ (ఆస్ట్రేలియా) తొలి ప్రపంచకప్‌లోనే ఈ ఫీట్‌ సాధించాడు. కుర్టిస్‌ కాంఫెర్‌ (ఐర్లాండ్‌), హసరంగ (శ్రీలంక), రబాడా (శ్రీలంక) కూడా హ్యాట్రిక్‌ వికెట్లు తీశారు.
  • టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో శ్రీలంక బ్యాటర్‌ తిలకరత్న దిల్షాన్‌ (35 మ్యాచ్‌లు) టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత 34 మ్యాచ్‌లతో షాహిద్ ఆఫ్రిది, షోయబ్‌ మాలిక్‌, డ్వేన్‌ బ్రాబో రెండో స్థానంలో, ఎంఎస్‌ ధోనీ, రోహిత్‌ శర్మ, ముస్తాఫికర్‌ రహీమ్‌ క్రిస్‌ గేల్‌ 33 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నారు. జయవర్ధనె 31, లసిత్‌ మలింగ్‌ 31 మ్యాచ్‌లు ఆడారు.
  • అత్యధికంగా 33 మ్యాచ్‌లకు ఎంఎస్‌ ధోనీ కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు.
  • టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యధికంగా అర్థ శతకాలు చేసినవారిలో విరాట్‌ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 10 అర్థశతకాలు చేశాడు. ఆ తర్వాత క్రిస్‌గేల్‌ 9, రోహిత్‌ శర్మ 8, జయవర్ధనె 6, డేవిడ్‌ వార్నర్‌ 6 అర్ధ శతకాలతో టాప్‌లో ఉన్నారు.
  • ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ (319) రికార్డు నమోదు చేశాడు.
  • ఎక్కువ సార్లు డకౌట్ అయిన వారిలో షాహిద్‌ ఆఫ్రిది, దిల్షాన్‌లు టాప్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఐదు సార్లు డకౌట్ అయ్యారు. సిమన్స్‌ నాలుగు సార్లు, ఆండ్రూ రస్సెల్ నాలుగు, సనత్‌ జయసూర్య నాలుగు, లూక్‌ రైట్ నాలుగు,ఆశిశ్‌ నెహ్రా మూడు సార్లు డకౌట్‌ అయ్యారు.
  • ఎక్కువ క్యాచ్‌లు పట్టింది మాత్రం దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌. మొత్తం 30 మ్యాచుల్లో 23 క్యాచ్‌లు పట్టాడు. గప్తిల్‌ 19, డేవిడ్‌ వార్నర్‌ 18, రోహిత్‌ శర్మ 15, స్టివ్‌ స్మిత్‌ 14 క్యాచ్‌లతో టాప్‌ 5లో ఉన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

T20 world cup winners | ఇప్పటివరకు టీ20 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ అందుకున్న దేశాలు ఇవే.. ఎక్కువ సార్లు విశ్వ విజేతగా నిలిచిన జట్టు ఏది ?

T20 world cup | తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. పసికూన నమీబియా చేతిలో దారుణంగా ఓడిన శ్రీలంక

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News