Wednesday, November 29, 2023
- Advertisment -
HomeLatest NewsJio 5G | ఇప్పుడు ఉన్న అన్ని ఫోన్ల‌లో జియో 5జీ ప‌నిచేస్తుందా?

Jio 5G | ఇప్పుడు ఉన్న అన్ని ఫోన్ల‌లో జియో 5జీ ప‌నిచేస్తుందా?

Jio 5G | ఎట్ట‌కేల‌కు భార‌త్‌లో 5జీ సేవ‌లు మొద‌ల‌య్యాయి. విడ‌త‌ల వారీగా దేశంలోని అన్ని న‌గ‌రాల్లో 5జీ స‌ర్వీస్‌లు అందించేందుకు టెలికం కంపెనీలు సిద్ధ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే SA ( Stand Alone ) టెక్నాల‌జీతో 5జీ సేవ‌ల‌ను అందిస్తామ‌ని జియో ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్‌ను కొనుగోలు చేసిన క‌స్ట‌మ‌ర్లు సందిగ్ధంలో ప‌డిపోయారు. అస‌లు SA ( స్టాండ్ ఎలోన్ ) , NSA ( నాన్ స్టాండ్ ఎలోన్ ) అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న ఏ మొబైల్స్‌లో జియో 5 జీ సేవ‌లు పొంద‌వ‌చ్చో తెలియ‌క టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఈ క్రమంలో ఏయే మొబైల్స్‌లో 5జీ స‌పోర్ట్ చేస్తుందో ఒక‌సారి తెలుసుకుందాం..

SA, NSA మ‌ధ్య తేడా ఏంటి?

స్టాండ్ ఎలోన్ అంటే పూర్తిస్థాయి 5జీ నెట్‌వ‌ర్క్ కోసం అందుబాటులో ఉన్న టెక్నాల‌జీ. ఇందులో బేస్ స్టేష‌న్ నుంచి రేడియో యాంటీనా వర‌కు అన్నీ 5జీ స్పెసిఫికేష‌న్ల‌తోనే రూపొందిస్తారు. డేటా, వాయిస్ అన్ని కూడా 5జీ రేడియో యాంటీనాల‌తోనే ప‌నిచేస్తాయి. దీని కోసం ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది. అదే నాన్ స్టాండ్ ఎలోన్ నెట్‌వ‌ర్క్ అలా కాదు. ఇది 4జీ స్పెసిఫికేష‌న్ల‌తోనే 5జీ సేవ‌ల‌ను పొందేందుకు స‌హాయ‌ప‌డుతుంది. దీంతో ఖ‌ర్చు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. కానీ డేటా విష‌యంలో ఇది SA అంత వేగంగా ఉండ‌దు. వాయిస్ క్వాలిటీ కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న మొబైల్స్‌లోని NSA నెట్‌వ‌ర్క్‌ను SA కు అప్‌గ్రేడ్ చేసుకునే అవ‌కాశం ఉంది.

ఏ మొబైల్స్‌లో జియో 5జీ స‌పోర్ట్ చేస్తుందంటే..

ఐఫోన్ 12 సిరీస్ నుంచి యాపిల్ కంపెనీ 5జీని స‌పోర్ట్ చేసేలా త‌యారు చేసింది. 13 సిరీస్ మొబైల్స్‌లో జియో 5జీ సేవ‌ల‌ను ఈజీగా పొంద‌వ‌చ్చు. కానీ ముందు తీసుకొచ్చిన 12 సిరీస్ మొబైల్స్‌లో నేరుగా స్టాండ్ ఎలోన్ 5జీ వ‌స్తుందా? లేదా అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందా అన్న విష‌యంపై ఇంకా క్లారిటీ లేదు.

వ‌న్ ప్ల‌స్ 8, 8 ప్రో మొబైల్స్‌తో పాటు 9, 10 సిరీస్ మొబైల్స్లో N78 బ్యాండ్‌తో పాటు SA, NSA సపోర్ట్ చేస్తుంది. అంటే 5జీ సేవలను పొందవచ్చు. అయితే అది నేరుగానా? అప్ గ్రేడ్ చేసుకుంటేనా అనేది తెలియదు. ఫస్ట్ నార్డ్, నార్డ్ సీీీీఈ మొబైల్స్‌లో N78 బ్యాండ్ మాత్రమే వినియోగిస్తున్నారు. కాబట్టి 5 జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.

ఒప్పో మొబైల్స్ విషయానికొస్తే A53, రెనో సిరీస్‌లో 7 మోడల్స్ SA, NSA రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. K10, A74 మోడల్స్‌లో ఏ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయనేది క్లారిటీ లేదు.

వివో మొబైల్స్ విషయానికొస్తే T1 Pro, V25, X80 సిరీస్ మొబైల్స్‌లో SA, NSA నెట్‌వర్క్ రెండింటినీ సపోర్ట్ చేస్తాయి. అయితే SA నెట్‌వర్క్ వినియోగించుకోవాలంటే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. Y72 మోడల్ కోసం కూడా ఒక అప్‌డేట్ ఇవ్వనున్నారు.

శాంసంగ్ నథింగ్ మొబైల్స్‌లో ఎలాంటి అప్‌డేట్ లేకుండానే SA నెట్‌వర్క్ సాయంతో 5 జీ సేవలు పొందవచ్చు. మిగిలిని మోడల్స్‌లోనూ SA సపోర్ట్ చేస్తుంది. అయితే 5 జీ సేవలు పొందేందుకు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

షావోమి, రెడ్ మీ, పోకో నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని5 జీ ఫోన్లలో 5 జీ సేవలు వినియోగించుకోవచ్చు. దీనికోసం ఓటీఏ అప్‌డేట్ ద్వారా మొబైల్స్‌లో మార్పులు చేయనున్నారు.

రియల్‌మీ నుంచి వచ్చిన అన్ని 5 జీ మొబైల్స్‌లోనూ SA, NSA రెండు నెట్‌వర్క్‌లు సపోర్ట్ చేస్తాయి. అయితే ఇది నేరుగానా? లేదా ఓటీఏ అప్‌డేట్ ద్వారానా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News