Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsDavid Warner | రెండో టెస్టు నుంచి తప్పుకున్న వార్నర్‌.. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రెన్‌ షా..

David Warner | రెండో టెస్టు నుంచి తప్పుకున్న వార్నర్‌.. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రెన్‌ షా..

David Warner | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ఫామ్‌లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌, విధ్వంసక వీరుడు డేవిడ్‌ వార్నర్‌.. రెండో టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. నాగ్‌పూర్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన వార్నర్‌.. తాజా పోరు తొలి ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు మొండిగా ప్రయత్నించి 15 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఆ పరుగులు చేసేందుకు 44 బంతులు తీసుకున్న వార్నర్‌.. రన్స్‌ కంటే ఎక్కువ దెబ్బలు తగిలిచ్చుకున్నాడు. బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మహమ్మద్‌ షమీ, సిరాజ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. సిరాజ్‌ వేసిన కొన్ని బౌన్సర్లు వార్నర్‌ హెల్మెట్‌కు బలంగా తగలగా.. ఓ బంతి అతడి మోచేతిని గాయపరిచింది. దీంతో వైద్యుల సహాయం తీసుకొని బ్యాటింగ్‌ కొనసాగించిన వార్నర్‌ పట్టుదల ప్రదర్శించినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. షమీ బౌలింగ్‌లో కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే మ్యాచ్‌ గాయాల కారణంగా వార్నర్‌ అస్వస్థతకు గురైనట్లు సహచర ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా శుక్రవారమే వెల్లడించగా.. భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వార్నర్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. బంతి పదే పదే తలపై తగలడంతో స్వల్ప అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నట్లు ఆస్ట్రేలియా శిబిరం వెల్లడించింది. దీంతో ఈ మ్యాచ్‌ నుంచి అతడిని తప్పించారు. ఐపీఎల్లో ఆడిన అనుభవంతో భారత పిచ్‌లపై వార్నర్‌ ఇరగదీస్తాడని ఆసీస్‌ భావించగా.. అనూహ్యంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టుకు ముందు వరకు వైద్య బృందం వార్నర్‌ను పరిశీలిస్తుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది.

కంకషన్‌గా రెన్‌షా..

రెండో రోజు భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలోనూ వార్నర్‌ మైదానంలోకి రాకపోగా.. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా అతడి స్థానంలో రెన్‌షాను తుది జట్టులోకి తీసుకున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. గత మ్యాచ్‌లో తుది జట్టులో ఉన్న రెన్‌షా.. ట్రావిస్‌ హెడ్‌ రాకతో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వార్నర్‌ గాయపడటంతో అనూహ్యంగా రెన్‌షాకు అవకాశం దక్కింది. కాగా.. తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచ్‌లో పట్టుదల ప్రదర్శించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు ఎదురుదాడికి దిగి తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేశారు. ఉస్మాన్‌ ఖవాజా, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 4, అశ్విన్‌, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ టాపార్డర్‌ వైఫల్యంతో ఒక దశలో 139/7తో నిలిచినా.. అక్షర్‌ పటేల్‌ (74), రవిచంద్రన్‌ అశ్విన్‌ (37) రాణించడంతో 262 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట వీరిద్దరూ తమ విలువ చాటుకున్నారు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా వార్నర్‌ స్థానంలో ట్రావిస్‌ హెడ్‌ను ఓపెనర్‌గా పంపింది. ఓపెనర్లు ధాటిగా ఆడటంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఆసీస్‌ ప్రస్తుతం 62 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News