Saturday, April 20, 2024
- Advertisment -
HomeSportsIND vs AUS | ఖవాజా, గ్రీన్ సెంచరీలు.. ఆస్ట్రేలియా 480 ఆలౌట్.. భారత్ తొలి...

IND vs AUS | ఖవాజా, గ్రీన్ సెంచరీలు.. ఆస్ట్రేలియా 480 ఆలౌట్.. భారత్ తొలి ఇన్నింగ్స్ 36/0

IND vs AUS | టైమ్ 2 న్యూస్, అహ్మదాబాద్: బోర్డర్-గవాస్కర్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా సత్తాచాటింది. తొలి రోజు కనబర్చిన జోరును రెండో రోజు కూడా కొనసాగించడంతో.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (422 బంతుల్లో 180; 21 ఫోర్లు) భారీ సెంచరీ నమోదు చేసుకోగా.. పేస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ (170 బంతుల్లో 114; 18 ఫోర్లు) టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని తన పేరిట రాసుకున్నాడు. ఆఖర్లో నాథన్ లియాన్ (96 బంతుల్లో 34; 6 ఫోర్లు), టాడ్ మార్ఫి (61 బంతుల్లో 41; 5 ఫోర్లు) కూడా తమ బ్యాట్లకు పనిచెప్పారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 6, మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా.. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17), శుభ్మన్ గిల్ (18) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 444 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రెండు రోజులు పూర్తిగా బ్యాటింగ్కు సహకరించిన అహ్మదాబాద్ పిచ్.. మూడో రోజు నుంచి స్పిన్కు మొగ్గుచూపే అవకాశం ఉండటం భారత్ను కాస్త కలవరపెడుతున్నది. మరోవైపు న్యూజిలాండ్తో సిరీస్లో శ్రీలంక దూకుడుగా ఆడుతున్న నేపథ్యంలో.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్లూ్యటీసీ) ఫైనల్కు చేరాలంలే రోహిత్ సేనకు ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. రెండో రోజు చివర్లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియాకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ నెమ్మదిగా ఆడుతూ వికెట్ పడకుండా రోజును ముగించారు. మూడోరోజు మన టాపార్డర్ ప్రదర్శనపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

అశ్విన్ ఒక్కడే..
ఓవర్నైట్ స్కోరు 255/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఉస్మాన్ ఖవాజా, గ్రీన్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలి సెషన్ మొత్తం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఈ ఇద్దరూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ఉస్మాన్ ఆచితూచి ఆడుతుంటే.. గ్రీన్ మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు. ఐదో వికెట్కు 208 పరుగులు జోడించిన అనంతరం గ్రీన్ను అశ్విన్ ఔట్ చేశాడు. అదే ఓవర్లో అలెక్స్ కారీ (0) కూడా వెనుదిరిగాడు. స్టార్క్ (6) ఎక్కువసేపు నిలువలేకపోగా.. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ఉస్మాన్ ఖవాజాను చివరకు అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. రివ్యూ ద్వారా భారత్ ఈ వికెట్ సాధించింది. ఇంకేముంది మరికాసేపట్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటే.. ఆసీస్ స్పిన్నర్లు ఆఖర్లో పోరాట పటిమ కనబర్చారు. లియాన్, మార్ఫి స్పెషలిస్ట్ బ్యాటర్లను తలపిస్తూ.. పరుగులు రాబట్టారు. అశ్విన్ ఒక్కడే కాస్త ప్రభావం చూపగా.. మిగిలినవాళ్ల బౌలింగ్లో ఈ జోడీ సునాయాసంగా పరుగులు రాబట్టింది. తొమ్మిదో వికెట్కు వీరిద్దరూ 70 పరుగులు జోడించడంతో ఆసీస్ మరింత భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరినీ అశ్విన్ ఔట్ చేయడంతో కంగారూల ఇన్నింగ్స్కు తెరపడింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News