Tuesday, June 18, 2024
- Advertisment -
HomeLatest NewsSunrisers Hyderabad | సన్‌రైజర్స్‌ కొత్త సారథి ఇతడే.. కెప్టెన్‌ను ప్రకటించిన హైదరాబాదీ ఫ్రాంచైజీ

Sunrisers Hyderabad | సన్‌రైజర్స్‌ కొత్త సారథి ఇతడే.. కెప్టెన్‌ను ప్రకటించిన హైదరాబాదీ ఫ్రాంచైజీ

Sunrisers Hyderabad | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: వచ్చే నెల చివరి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త సారథిని ఎంపిక చేసుకుంది. గత సీజన్‌లో హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్‌ విలియమ్సన్‌ను వేలానికి వదిలేసుకున్న సన్‌రైజర్స్‌ యాజమాన్యం.. మరోసారి విదేశీ కెప్టెన్‌ వైపే మొగ్గుచూపింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌కు హైదరాబాద్‌ పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించింది. ‘నిరీక్షణ ముగిసింది.. ఆరెంజ్‌ ఆర్మీ కొత్త కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌కు స్వాగతం చెప్పండి’ అని ఎస్‌ఆర్‌హెచ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహించగా.. పది జట్లు పాల్గొన్న లీగ్‌లో మన టీమ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గి.. ఎనిమిదింట ఓటమి పాలైంది. మార్చి 31 నుంచి ఐపీఎల్‌-2023 ప్రారంభం కానుండా.. లీగ్‌లో హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ‘దక్షిణాఫ్రికా 20’ లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మార్క్‌రమ్‌ ఐపీఎల్లోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. 29 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌.. ‘దక్షిణాఫ్రికా 20’ లీగ్‌లో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో 366 పరుగులు చేయడంతో పాటు.. బంతితో 11 వికెట్లు పడగొట్టి అదుర్స్‌ అనిపించాడు. సారథిగా జట్టును ముందుండి నడిపించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు.

రాత మారేనా..

మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ను అనవసరంగా వదిలేసుకున్న రైజర్స్‌.. జట్టుకు అభిమాన గణాన్ని పెంచిన డేవిడ్‌ వార్నర్‌ను కూడా పెద్దగా పట్టించుకోలేదు. దుబాయ్‌ వేదికగా జరిగిన సీజన్‌లో వార్నర్‌ పట్ల అగౌరవంగా వ్యవహరించిన ఫ్రాంచైజీ.. అతడి సేవలను కూడా కోల్పోయింది. ఇక బ్యాటింగ్‌లో కీలకమైన కేన్‌ విలియమ్సన్‌ను తాజా వేలానికి వదిలేసుకున్న రైజర్స్‌.. అతడి స్థాయి ఆటగాడిని ఎంపిక చేసుకోవడంలోనూ విఫలమైంది. గత సీజన్‌లో పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ అగర్వాల్‌ను కొనుగోలు చేసుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. మార్క్‌రమ్‌కు పగ్గాలు ఇచ్చింది. టీమిండియా స్టార్లను ఎంపిక చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపని ఫ్రాంచైజీ.. యువ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించిన విషయం తెలిసిందే. మరి దక్షిణాఫ్రికా లీగ్‌లో దుమ్మురేపిన మార్క్‌రమ్‌ ఐపీఎల్లోనూ అదే స్థాయిలో రాణిస్తాడా చూడాలి. కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం మార్క్‌రమ్‌ మాట్లాడుతూ.. ‘సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించనుండటం గర్వంగా ఉంది. ఫాఫ్‌ డుప్లెసిస్‌, కేన్‌ విలియమ్సన్‌ను దగ్గరి నుంచి గమనించా.. వారి బాటలోనే ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తా. హైదరాబాద్‌ జట్టుకు అభిమానుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. వారి అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తా’ అని అన్నాడు. 2016లో చివరిసారి ఐపీఎల్‌ ట్రోఫీ చేజిక్కించుకున్న సన్‌రైజర్స్‌.. ఈసారి రెండోసారి చాంపియన్‌గా నిలుస్తుందా చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News