Wednesday, May 22, 2024
- Advertisment -
HomeEntertainmentFilmfare awards 2022 | త‌గ్గేదేలే.. ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప‌.. సాయిప‌ల్ల‌వికి రెండు...

Filmfare awards 2022 | త‌గ్గేదేలే.. ఫిలింఫేర్ అవార్డుల్లో స‌త్తా చాటిన పుష్ప‌.. సాయిప‌ల్ల‌వికి రెండు అవార్డులు

Filmfare awards 2022 | పుష్ప‌ సినిమా విడుదలై 10 నెల‌లు అయినా ఇంకా ఈ సినిమా మేనియా త‌గ్గేదేలే అన్న‌ట్టుగా ఉంది. ఇప్ప‌టికీ స్టార్ హీరోలు, క్రికెట‌ర్లు ఈ డైలాగుతో మెస్మ‌రైజ్ చేస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజై సంచ‌ల‌నం సృష్టించిన పుష్ప ( pushpa ) సినిమా హ‌వా ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

తాజాగా జ‌రిగిన ఫిలింఫేర్ అవార్డుల ( Filmfare awards ) ప్ర‌దానోత్స‌వంలోనూ ఇది స్ప‌ష్టంగా క‌నిపించింది. 67వ ఫిలింఫేర్ అవార్డుల్లో 7 అవార్డులు పుష్ప సినిమానే సొంతం చేసుకుంది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ గాయ‌కుడు, ఉత్త‌మ గాయ‌ని, ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫ‌ర్ కేట‌గిరీల్లో 7 అవార్డుల‌ను అందుకుని పుష్ప సినిమా స‌త్తా చాటింది.

ఇక ఉత్త‌మ న‌టిగా సాయిప‌ల్ల‌వి రెండు అవార్డులు గెలుచుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్‌, దివంగ‌త క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు ఈ ఏడాది ఫిలింఫేర్ జీవిత సాఫల్య పుర‌స్కారం వ‌రించింది. ఆదివారం రాత్రి బెంగళూరులో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ వేడుక‌ల్లో ఫిలింఫేర్ అవార్డులు ఎవ‌రికి వ‌చ్చాయో చూద్దాం..

తెలుగు

ఉత్త‌మ చిత్రం – పుష్ప ది రైజ్‌
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – సుకుమార్ ( పుష్ప ది రైజ్ )
ఉత్త‌మ న‌టుడు – అల్లు అర్జున్ ( పుష్ప ది రైజ్ )
ఉత్తమ న‌టి – సాయిప‌ల్ల‌వి ( ల‌వ్ స్టోరి )
ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు – ముర‌ళీ శ‌ర్మ ( అల వైకుంఠ‌పుర‌ములో )
ఉత్త‌మ స‌హాయ న‌టి – ట‌బు ( అల వైకుంఠపుర‌ములో )
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు – దేవీశ్రీ ప్ర‌సాద్ ( ( పుష్ప ది రైజ్ )
ఉత్త‌మ గాయ‌ని – ఇంద్రావ‌తి చౌహాన్ ( పుష్ప ది రైజ్ )
విమ‌ర్శ‌కుల ఉత్త‌మ న‌టి – సాయిప‌ల్ల‌వి ( శ్యామ్ సింగ‌రాయ్ )
విమ‌ర్శ‌కుల ఉత్త‌మ న‌టుడు – నాని ( శ్యామ్ సింగ‌రాయ్ )
ఉత్త‌మ కొరియోగ్ర‌ఫ‌ర్ – శేఖ‌ర్ మాస్ట‌ర్ ( అల వైకుంఠ‌పుర‌ములో )
ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫ‌ర్ – మిరోస్లా బ్రొజెక్ ( పుష్ప ది రైజ్ )
ఉత్త‌మ డెబ్యూ న‌టి – కృతిశెట్టి ( ఉప్పెన )
ఉత్త‌మ డెబ్యూ నటుడు – వైష్ణ‌వ్ తేజ్ ( ఉప్పెన )

ఇక త‌మిళ విభాగంలో సూర్య సినిమాలు రెండు స‌త్తా చాటాయి. సూరారై పోట్రుకు 7 అవార్డులు, జై భీమ్ సినిమాకు రెండు అవార్డులు ద‌క్కాయి.

ఉత్త‌మ చిత్రం – జై భీమ్‌
ఉత్త‌మ ద‌ర్శ‌కురాలు – సుధా కొంగ‌ర ( సూరారై పోట్రు )
ఉత్త‌మ న‌టుడు – సూర్య ( సూరారై పోట్రు )
ఉత్త‌మ నటి – లిజోమోల్ జోసి ( సూరారై పోట్రు )
ఉత్త‌మ స‌హాయ న‌టుడు – ప‌శుప‌తి ( సార్ప‌ట్ట )
ఉత్త‌మ స‌హాయ న‌టి ఊర్వశి ( సూరారై పోట్రు )
ఉత్త‌మ గేయ ర‌చ‌యిత – అరివు ( సార్ప‌ట్ట )
ఉత్త‌మ గాయ‌కుడు – క్రిస్టిన్ జాస్‌, గోవింద్ వ‌సంత ( సూరారై పోట్రు )
ఉత్త‌మ గాయ‌ని – ధీ ( సూరారై పోట్రు )
ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్ – దినేశ్ కుమార్ ( మాస్ట‌ర్ )
ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ – నికిత్ ( సూరారై పోట్రు )

Follow Us : FacebookTwitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News