Wednesday, November 29, 2023
- Advertisment -
HomeEntertainmentPawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే...

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్ గత రెండేళ్లలో ఎన్నడు లేని విధంగా చాలా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. సినిమాలతో డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్. తన పార్టీ కార్యకర్తలు నడపాలి అంటే కచ్చితంగా సొంత డబ్బులు ఉండాలి.. విరాళాల నుంచి వచ్చిన డబ్బులతో తన పార్టీ నడపను అంటూ ఇదివరకే స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్.

దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చే ఎన్నికలలో కనీసం 200 కోట్లు సంపాదించాలని ఆలోచిస్తున్నాడు ఈయన. ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నాడు.
ఆయన ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉండడంతో.. వరుస సినిమాలు కమిట్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ). ఇప్పటికే క్రిష్ ( krish ), హరిష్ శంకర్ ( Harish shankar ) లాంటి దర్శకులు లైన్ లో ఉండగానే తాజాగా సుజిత్ ( sujeeth ) సైతం రేస్ లోకి వచ్చాడు.

ఈయన సినిమా అందరి కంటే ముందు మొదలుపెట్టాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే హరి హర వీరమల్లు ( Hari hara veramallu ) సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీని తర్వాత నేరుగా సుజిత్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టమన్నాడు పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది మొదటి అర్థ భాగంలోనే ఈ సినిమా పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్. ఈ రెండు సినిమాలకు ఒకేసారి డేట్స్ అడ్జస్ట్ చేయాలని చూస్తున్నాడు.

ఇదంతా ఇలా ఉంటే సుజిత్ సినిమా బ్యాక్ డ్రాప్ పై చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లో ముంబై, జపాన్ ను హైలెట్ చేశారు మేకర్స్. ఈ రెండింటి మధ్య కథ సాగుతుందని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీలు పెద్దగా కలిసి రాలేదు. కాకపోతే ఈయనకు గన్స్ ఉన్న కథలు అంటే చాలా ఇష్టం. గతంలో పవన్ కళ్యాణ్ కు గన్స్పై ఉన్న ఇష్టాన్ని పూరి జగన్నాథ్ చాలా కామెడీగా చెప్పాడు కూడా. సినిమాలో కథ ఏమీ ఉండదు.. కేవలం గన్స్ మాత్రమే ఉంటాయి అని చెప్తే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తాడు.. అంటూ బిజినెస్ మాన్ ఆడియో ఫంక్షన్ లో పూరి చెప్పిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి.

తనకు కలిసి రాని మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత పవన్ అభిమానులు కంగారు పడుతున్నారు. కాకపోతే సాహో సినిమా ఫ్లాప్ అయినా కూడా సుజిత్ మేకింగ్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ తో అంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తే మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకున్నట్టే. ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుజిత్. అన్నట్టు ఈ సినిమాకు గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే పదాన్ని హైలైట్ చేశారు దర్శక నిర్మాతలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

Kriti Sanon | ప్రభాస్‌తో డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన కృతిసనన్‌.. తనకు కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Ananya Panday | లైగర్‌ ఎఫెక్ట్‌.. ఆఫర్లు లేక భారీగా రెమ్యునరేషన్‌ తగ్గించిన అనన్య పాండే

Megastar chiranjeevi | చిరంజీవి, రామ్ చరణ్ అవార్డుల వెనుక రాజకీయం ఉందా ? అభిమానులు ఏమంటున్నారు ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News