Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsGroup 4 Jobs | ముగిసిన గ్రూప్‌ 4 దరఖాస్తుల గడువు.. ఊహించని రీతిలో ధరఖాస్తులు

Group 4 Jobs | ముగిసిన గ్రూప్‌ 4 దరఖాస్తుల గడువు.. ఊహించని రీతిలో ధరఖాస్తులు

Group 4 Jobs | తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 9 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి జనవరి 30వ తేదీనే గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల సౌలభ్యం కోసం మరో నాలుగు రోజులు పొడిగించారు.

ఇక గ్రూప్‌-4 పరీక్ష తేదీని ఫిబ్రవరి 2న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి జులై 1 న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12: 30 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు టీపీపీఎస్సీ ( TSPSC ) పేర్కొంది.

రెండు పేపర్లలోనూ 150 చొప్పున ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున రెండు పేపర్లూ కలిపి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. అబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే పరీక్ష ఓఎంఆర్‌ బేస్డ్‌గా ఉంటుంది. ఈ పరీక్ష ను ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహించినున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Free Flight Tickets | హాంకాంగ్ బంపర్ ఆఫర్.. 5 లక్షల మందికి ఫ్రీగా విమాన టికెట్లు

Super Cows | లక్ష లీటర్ల పాలు ఇచ్చే ఆవులను సృష్టించిన చైనా.. క్లోనింగ్‌ ద్వారా సరికొత్త సృష్టి

Viral News | విమాన టికెట్ కొనాల్సి వస్తుందని కన్నబిడ్డనే వదిలి వెళ్లడానికి సిద్ధమైన తల్లిదండ్రులు.. దారుణం!

Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Queen Elizabeth II | కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News