Tuesday, April 23, 2024
- Advertisment -
HomeNewsInternationalSuper Cows | లక్ష లీటర్ల పాలు ఇచ్చే ఆవులను సృష్టించిన చైనా.. క్లోనింగ్‌ ద్వారా...

Super Cows | లక్ష లీటర్ల పాలు ఇచ్చే ఆవులను సృష్టించిన చైనా.. క్లోనింగ్‌ ద్వారా సరికొత్త సృష్టి

Super Cows | చైనా శాస్త్రవేత్తలు భారీ మొత్తంలో పాలను ఉత్పత్తి చేయగల 3 సూపర్‌ ఆవులను క్లోన్ చేశారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న జాతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం చైనా శాస్త్రవేత్తలు ఇలా సరికొత్తగా ట్రై చేశారు. సక్సెస్‌ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శాస్త్రవేత్తలు.. చైనా పాడి పరిశ్రమలో ఇది అద్భుత విజయమన్నారు.

➢ నార్త్‌వెస్ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫారెస్ట్రీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ మూడు దూడలను క్లోనింగ్‌ చేశారు.

➢ జనవరి 23న ఇవి జన్మించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. నెదర్లాండ్‌కి చెందిన హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతికి చెందిన అధిక ఉత్పాదక ఆవుల నుండి వీటిని క్లోన్ చేశారు.

➢ ఇప్పుడు క్లోన్‌ చేసిన ఆవులు ఏడాదికి 18వేల లీటర్లు లేదా వాటి జీవిత కాలంలో లక్ష లీటర్ల వరకు పాలు ఇస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అదే అమెరికాలో ఇలా క్లోన్‌ చేసిన ఆవులు ఇచ్చే పాల కన్నా చైనా సూపర్‌ ఆవులు 1.7 రెట్లు ఎక్కువ పాలు ఇస్తాయని పేర్కొన్నారు.

➢ చైనా శాస్త్రవేత్తలు క్లోన్ చేసిన దూడలలో మొదటిది డిసెంబర్ 30న జన్మించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భారీ పరిమాణం ఉన్న కారణంగా సర్జరీ చేసి బయటకు తీసినట్లు తెలిపారు.

చైనాలో 70% పాడి ఆవులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశీ పాడి ఆవులపై చైనా ఆధారపడటం కొంచెం కష్టంగా అనిపించడంతో 1,000 సూపర్ ఆవులను సృష్టించేందుకు మూడు సంవత్సరాల సమయం తీసుకున్నట్లు క్లోనింగ్‌ చేసిన బృందంలోని ప్రధాన శాస్త్రవేత్త జిన్ యాపింగ్‌ తెలిపారు. గతంలో చైనాకు చెందిన ఒక సంస్థ ప్రపంచంలో మొట్టమొదటిసారి క్లోనింగ్‌ ద్వారా తోడేలును సృష్టించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | బాల భీముడు.. భలే ముద్దొస్తున్నాడుగా.. 8 కేజీల బరువుతో శిశువు జననం

Queen Elizabeth II | కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Vistara | విమాన సిబ్బందిని తిట్టి.. అర్థనగ్నంగా నడిచిన ప్రయాణికురాలు.. ఆ తర్వాత ఏమైంది?

Indian Economy | 50 శాతం వాటా ఇండియా, చైనాదే అవుతోంది.. ఐఎంఎఫ్‌ కీలక వ్యాఖ్యలు

China | పెళ్లి చేసుకోకున్నా సరే పిల్లల్ని కనండి.. అన్ని బెనిఫిట్స్ ఇస్తామని ప్రోత్సహిస్తున్న చైన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News