Movie Ticket Only for One rupee | హెడ్డింగ్ చూసి నిజమేనా కాదా అని అనుమానపడుతున్నారా ! సందేహం ఏమీ అక్కర్లేదు !! ఇందులో ఏదో గిమ్మిక్కు ఉందని కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. నిజంగానే ఒక్క రూపాయికే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడవచ్చు. హైదరాబాద్ సిటీలో ఒక మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే కనీసం 150 రూపాయలు అవుతుంది. అలాంటిది ఒక్క రూపాయికే టికెట్ ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ఆలోచిస్తున్నారా !
ఈ ఆఫర్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటని పెద్దగా ఆలోచించి బుర్రలేమీ పాడుచేసుకోకండి. మౌలాలీలో మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ పేరిట కొత్తగా ఒక మల్టీప్లెక్స్ ఏర్పాటైంది. డిసెంబర్ 15న ఈ థియేటర్‌ను గ్రాండ్‌గా ఓపెన్ చేయబోతున్నారు. అందుకోసమే ఓపెనింగ్ ఆఫర్ కింద ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అలా అని ఏదో ఒక్క షో కోసమో ఈ ఆఫర్ ఇవ్వలేదు. డిసెంబర్ 15న మూవీ మ్యాక్స్ థియేటర్లో తెలుగు, హిందీ భాషల్లో కలిపి 11 సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి. వీటన్నింటిపైనా అన్ని షోలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రస్తుతం మూవీ మ్యాక్స్ థియేటర్లో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, హిట్ 2, చెప్పాలని ఉంది, యశోద, కాంతార, మసూద, లవ్ టుడే, దృశ్యం2 ( హిందీ ), భేడియా ( హిందీ ) సినిమాలను ప్రదర్శిస్తున్నారు. వీటిలో ఏ సినిమా అయినా సరే ఒక్క రూపాయికే చూడవచ్చు. ఈ మల్టీప్లెక్స్ టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. అమెజాన్, బుక్ మై షో యాప్‌ల ద్వారా ఈ టికెట్లను పొందవచ్చు. ఒక్క రూపాయికే సినిమా చూడొచ్చనే విషయం తెలిసిన సినీ ప్రియులు టికెట్ల కోసం ఆన్లైన్లో ఎగబడ్డారు. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరగడంతో చాలాసేపటివరకు సర్వర్ డైన్ అయ్యింది. ఆ తర్వాత టికెట్లు కూడా బుకింగ్ అవుతున్నాయి.
Read More Articles |
Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్
Megastar chiranjeevi | చిరంజీవి, రామ్ చరణ్ అవార్డుల వెనుక రాజకీయం ఉందా ? అభిమానులు ఏమంటున్నారు ?
Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్ అంత ఎమోషన్‌గా సాగిందా?
Haripriya Engagement | కేజీఎఫ్ విలన్‌తో ఘనంగా హీరోయిన్ ఎంగేజ్మెంట్