Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsMLC Kavitha Met Telangana CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత...

MLC Kavitha Met Telangana CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ.. ఢిల్లీ లిక్కర్‌ కేసు విచారణ సాగిన తీరుపై వివరణ ?

MLC Kavitha Met Telangana CM KCR | ఢిల్లీ లిక్కర్‌ కేసులో సీబీఐ అధికారులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం ఆమె నివాసంలో విచారించారు. లిక్కర్‌ కేసుకు సంబంధించి ఆమె చెప్పిన స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. అయితే సీబీఐ అధికారుల విచారణ ముగిసిన అనంతరం కవిత నేరుగా ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. అనంతరం ప్రగతిభవన్‌ నుంచి తన నివాసానికి కవిత బయల్దేరి వెళ్లారు. సీబీఐ విచారణ ఎలా జరిగిందనే విషయాలను సీఎం కేసీఆర్‌కు కవిత వివరించినట్లు సమాచారం.

కాగా, రెండు బృందాలుగా హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చిన అధికారులు సీఆర్‌పీసీ 160 కింద కవిత వాంగ్మూలం తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు ఏడు గంటలకు పైగా కవితను ప్రశ్నించారు. కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు.
అనంతరం సీబీఐ అధికారులు ఢిల్లీ వెళ్లిపోయారు. విచారణ ముగిసిన తర్వాత కవిత నివాసానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితను కోరినా బిజీ షెడ్యూల్‌ వల్ల వీలుకాలేదు. దీంతో 11,12,14,15 తేదీల్లో అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని కవిత నివాసానికి ఆదివారం వచ్చారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

MLC Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. సాయంత్రం దాకా విచారణ !

TRC MLC Kalvakuntla Kavitha | నా గురించి మాట్లాడితే చెప్పుతో కొడతా.. బీజేపీ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News