Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsTelangana Cabinet Green Signal for 472 posts in roads and buildings department...

Telangana Cabinet Green Signal for 472 posts in roads and buildings department | తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో 472 పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. తక్షణమే నియామకాలు చేపట్టాలని ఆదేశం

Telangana Cabinet green signal for 472 posts in roads and buildings department | ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు, భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని నిర్ణయించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం

రోడ్లు, భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది.

రోడ్లు, భవనాల శాఖలో 472 పోస్టులు

రోడ్లు, భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డి.ఈ.ఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్ అండ్ బి శాఖ లోని రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్ కార్యాలయాలను, 13 డివిజన్ కార్యాలయాలను, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది.

భారీగా నిధులు మంజూరు

రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతు (పీరియాడిక్ రెన్యువల్స్) ల కోసం, రూ. 1,865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు వీలుగా కింది స్థాయి డి.ఈ.ఈ నుంచి పై స్థాయి సి.ఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డి.ఈ.ఈ కి వొక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈ.ఈ కి 25 లక్షల వరకు (ఏడాదికి 1.5 కోట్లు), ఎస్. ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సీ.ఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది.

ఇదే పద్దతిని అనుసరిస్తూ భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Farmers | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

CM KCR | బీఆర్‌ఎస్‌ లక్ష్యం అదేనా..? కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

TSPSC JL Notification | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక తొలిసారి నోటిఫికేషన్‌

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

TSPSC Notification | 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News