Monday, March 27, 2023
- Advertisment -
HomeLatest NewsMLA Sanjay Kumar | శ్రావణి వెనుక ఎవరో ఉన్నారు.. అందుకే ఆమె రాజీనామా చేసింది.....

MLA Sanjay Kumar | శ్రావణి వెనుక ఎవరో ఉన్నారు.. అందుకే ఆమె రాజీనామా చేసింది.. జగిత్యాల చైర్‌పర్సన్ రాజీనామాపై ఎమ్మెల్యే సంజయ్ రియాక్షన్

MLA Sanjay Kumar | జగిత్యాల చైర్‌పర్సన్ బోగ శ్రావణి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. బోగ శ్రావణి చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. శ్రావణి వెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే శ్రావణి రాజీనామా చేసిందని అనుమానం వ్యక్తం చేశారు.

కౌన్సిలర్లను ఎలాంటి క్యాంపులకు పంపలేదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కొద్ది నెలలుగా చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నప్పటికీ వారందరికీ సర్ది చెప్పామని ఆయన అన్నారు. పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తీసుకు వచ్చినప్పటికీ దాన్ని తోసిపుచ్చామని తెలిపారు. ఈ విషయాన్ని గతంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే విద్యాసాగరరావు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కౌన్సిలర్ల సమన్వయ సమావేశానికి రావాలని శ్రావణికి స్వయంగా ఫోన్ చేసి చెప్పినప్పటికీ ఆమె హాజరు కాలేదని తెలిపారు.

బోగ శ్రావణి, నేను తండ్రీకూతుళ్లలా ఉండేవాళ్లమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. మంచి భవిష్యత్తు ఉందని శ్రావణికి ఎన్నోసార్లు చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నానని శ్రావణి కామెంట్స్ చేయడం సరికాదని అన్నారు. దీన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన శ్రావణి.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని కంటతడి పెట్టుకున్నారు. తనకు, తన కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. పార్టీ కోసమే ఇన్ని రోజులు కష్టపడి పనిచేశానని.. కానీ తమ కుటుంబంపై బెదిరింపులకు దిగడంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తన ఆవేదనను వెల్లగక్కారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Spouse Category | దిగివచ్చిన ప్రభుత్వం… తెలంగాణలో టీచర్ల స్పౌజ్‌ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Revanth Reddy | ఈటలకు బీజేపీలో సంతృప్తి లేదు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan | విడగొడతాం అంటే తోలు తీస్తా.. జాగ్రత్తగా మాట్లాడండి.. పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

TSPSC Syllabus | గ్రూప్ 3 సిలబస్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News