Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsHeart Attack | జగిత్యాలలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన కౌన్సిలర్‌ భర్త.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మీయుల...

Heart Attack | జగిత్యాలలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన కౌన్సిలర్‌ భర్త.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మీయుల సమ్మేళనం రద్దు

Heart Attack | బీఆర్‌ఎస్‌ పార్టీ పండుగలా చేస్తున్న ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో హుషారుగా డ్యాన్స్‌ చేసిన ఓ నేత అక్కడే కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు శనివారం నాడు జగిత్యాల జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరుకానుంది. ఈ క్రమంలో ఆమెకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ర్యాలీ తీశారు. డప్పులు, వాయిద్యాల మధ్య పండుగలా జరిగిన ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ జిల్లా నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ రజని భర్త, బీఆర్‌ఎస్‌ నేత బండారి నరేందర్‌ ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. అలా డ్యాన్స్‌ చేస్తూ చేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బండారి నరేందర్ మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో నేడు జరగాల్సిన ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News