Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsDurgam Chinnaiah | ఆ ఎమ్మెల్యే అమ్మాయిల్ని పంపించమన్నాడు.. దుర్గం చిన్నయ్య భాగోతం బయటపెట్టిన యువతి

Durgam Chinnaiah | ఆ ఎమ్మెల్యే అమ్మాయిల్ని పంపించమన్నాడు.. దుర్గం చిన్నయ్య భాగోతం బయటపెట్టిన యువతి

Durgam Chinnaiah | బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరిజన్ డెయిరీ సీఈవో బోడపాటి శైలజ అలియాస్ షెజల సంచలన ఆరోపణలు చేసింది. బెల్లంపల్లిలో డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరిస్తానని చెప్పి మోసం చేశాడని పేర్కొంది. ఇందుకోసం తనవాళ్లకు షేర్స్ ఇవ్వమనడమే కాకుండా.. తన వద్దకు అమ్మాయిల్ని పంపించాలని కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఒక ఆడియో రికార్డు ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆ ఆడియో రికార్డ్‌లో ఏముందంటే..

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మించి.. మా దగ్గర మనీ తీసుకుని.. తిరిగి మా మీదనే తప్పుడు కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించాడు. ఈ దుర్గం చిన్నయ్యను మా బ్రాంచి ఓపెన్ కోసం ఫస్ట్ టైమ్ కలిశాం. అలా కలిసినప్పుడు మీ కంపెనీలో నాకు తెలిసిన వాళ్లకు షేర్స్ ఇవ్వండి. ఇస్తే మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. మీకు ఏం కావాలన్నా చేసి పెడతాను అని చెబితే దానికి ఓకే చెప్పాం. తను చెప్పిన పర్సన్స్‌కు షేర్స్ ఇచ్చాం. ఆ తర్వాత మాకు రెండెకరాల ల్యాండ్ ఇచ్చాడు. ఆ ల్యాండ్ తనదేనని చెప్పాడు. దానికి ఓకే చెప్పి ఆ ల్యాండ్‌లో భూమి పూజ చేశాం. ఈయన్ను రెగ్యులర్‌గా బిజినెస్ మీటింగ్స్ కోసం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలుస్తూ ఉండేవాళ్లం. ఓ రోజూ బిజినెస్ మీటింగ్ కోసం మా ఆఫీసులో పనిచేసే ఓ అమ్మాయి కూడా వచ్చింది. ఇలా రెండు మూడు సార్లు కలిశాం. ఓ రోజు కాల్ చేసి మీతో పాటు ఓ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయిని ఒక నైట్‌కు పంపిస్తారా? అని అడిగాడు.

ఆ అమ్మాయి అలాంటి కాదని మేం చెప్పాం. అలా పంపిస్తే మాకు బ్యాడ్ నేమ్ వస్తుందని.. మేం ఇలాంటివి చేయలేమని గట్టిగా మాట్లాడితే.. అలాంటిదేమీ కుదరదు.. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని పంపించాల్సిందే.. లేదంటే తర్వాత మీ ఇష్టమంటూ బెదిరించడం స్టార్ట్ చేశాడు. మేం చేసేదేమీ లేక.. తెలిసిన వాళ్లతో మాట్లాడి బ్రోకర్ నంబర్ ఇస్తే ఆయన వాళ్లతో టచ్‌లో ఉన్నాడు. దాని తర్వాత ఒకరోజు దళితబంధు గురించి మాట్లాడదాం రమ్మని పిలిపించాడు. మేం వెళ్లాం.. అక్కడ ఆల్కహాల్ అరెంజ్ చేసి నన్ను తాగు తాగు అని బలవంతం చేశాడు. నాకు ఆల్కహాల్ అలవాటు లేదని చెప్పినా తాగాల్సిందేనని ప్రెజర్ చేస్తే అక్కడి నుంచి వెళ్లిపోయా. ఆ తర్వాత మాట్లాడదామని మమ్మల్ని మంచిర్యాల పిలిపించాడు.

దళితబంధు కాన్సెప్ట్ గురించి మాట్లాడదామని ఎప్పట్నుంచో అనుకుంటే మీరు రావాట్లేదని చెప్పాడు. సార్.. మీరు వేర్వేరు దాంట్లోకి ఇన్వాల్స్ చేస్తున్నారు.. మేం అవి చేయలేమని చెబితే .. సరే.. సరే అలాంటివేమీ లేదు.. దీని గురించే మాట్లాడదామని పిలిపించాడు. బెల్లంపల్లిలో ఆయన ఇంటికి వెళ్లాం.. వెళ్లిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న పోలీసులకు అప్పజెప్పాడు. ఆయన పనేదో ఆయన చూసుకున్నాడు. మమ్మల్ని తీసుకెళ్లి మూడు రోజులు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. మా మీద ఏవేవో కేసులు పెట్టారు. మేం అలాంటివేమీ చేయలేదు. మాకు సంబంధం లేదు. మమ్మల్ని ఎందుకు పిలిపించారో కూడా అర్థం కావట్లేదు. మీటింగ్ అని పిలిపించి ఇలా తీసుకొచ్చి కస్టడీలో పెట్టేశారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే.. ఏమున్నా ఎమ్మెల్యేతో మాట్లాడుకోమ్మా అంత అయిపోతుంది కదా.. ఎమ్మెల్యే వింటాడు కదా అని నన్ను టార్చర్ చేశారు. మూడు రోజులు టార్చర్ చూపించారు. ఏ తప్పు చేయకున్నా మా మీద తప్పుడు కేసులు పెట్టించారు. నేను ఆయన చెప్పిందానికి ఒప్పుకోలేదని నన్ను రిమాండ్‌కు పంపించేశారు.

రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్లీ రెండు తప్పుడు కేసులు పెట్టాడు. తప్పుడు కేసులు పెట్టినదానికి మా దగ్గర ఎవిడెన్స్‌లు కూడా ఉన్నాయి. వాళ్లు కేసు పెట్టిన తేదీల్లో మేం ఇక్కడ లేనే లేము. దానికి సంబంధించి ఎవిడెన్స్‌లు చూపించినా కూడా పోలీసులు.. ఇవన్నీ మాకు సంబంధం లేదు. వాళ్లొచ్చి కేసులు పెట్టారు. పై నుంచి ప్రెజర్ ఉంది. మీరేం చెప్పిన వినమంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.

కండిషనల్ బెయిల్ కోసం మేం అక్కడికి వస్తే మమ్మల్ని ఎటాక్ చేయడానికి ఎమ్మెల్యే మనుషులు సంతోశ్, పోచన్న, శ్రీపతి, రమణ మమ్మల్ని ఫాలో చేసి పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెబితే కంప్లయింట్ తీసుకోమని చెప్పారు. సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడే ఫిర్యాదు చేయమని చెప్పారు. దీంతో లక్సెట్టిపేట పీఎస్‌కి కాల్ చేసి కంప్లయింట్ తీసుకోమని అడిగితే నువ్వు డైరెక్ట్ వచ్చి కంప్లయింట్ ఇస్తేనే ఫిర్యాదు తీసుకుంటా అన్నాడు. డైరెక్ట్‌గా రాలేను సార్.. నాకు థ్రెట్ ఉంది.. ఆన్‌లైన్‌లో చేస్తానని చెప్పినా కుదరదని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నాకు దుర్గం చిన్నయ్య, ఆయన మనుషుల నుంచి ముప్పు ఉంది. అంటూ ఆ వీడియోలో ఉంది.

ఖండించిన ఎమ్మెల్యే.. మరో వీడియో బయటపెట్టిన యువతి

షెజల్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం ఖండించారు. కొంతమంది వ్యక్తులు రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కావాలనే తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ షెజల ఖండించారు. ఎమ్మెల్యేను తాము బ్లాక్‌మెయిల్ చేస్తున్నామనేది అబద్ధమని తెలిపింది. ఎమ్మెల్యేనే తమను తప్పుడు కేసులతో అరెస్టు చేయించారని పేర్కొంది. కానీ పోలీసులు మాత్రం తామే పట్టుకున్నామని అబద్ధాలు ఆడుతున్నారని తెలిపింది. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యేతో జరిగిన ఛాటింగ్‌ను వీడియోలో చూపించింది. తమపై పెట్టిన తప్పుడు కేసుల సంగతి తెలియాలంటే ఎమ్మెల్యే ఇంటి సీసీ టీవీ ఫుటేజి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణ హాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

ట్యాబ్లెట్ కావాలా?

అమ్మాయిలను పంపించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఒత్తిడి చేయడంతో ఒక బ్రోకర్ నంబర్ ఇచ్చానని ఆరిజన్ సీఈవో ఆడియో రికార్డులో ఆరోపించింది. అయితే ఆ బ్రోకర్‌కు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఒకటి బయటకొచ్చింది. అందులో అమ్మాయిలను ట్యాబ్లెట్ అని కోడ్ లాంగ్వేజ్ వాడుతూ చాటింగ్ చేశాడు. ట్యాబ్లెట్లు ( అమ్మాయిలు ) కావాలా? అని సదరు బ్రోకర్ నుంచి ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటితో పాటు యువతుల ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

TSPSC Paper Leakage | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఒక్కటే కాదు.. మెయిన్స్‌ లీకేజీకి కూడా స్కెచ్‌.. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఎన్నో కుట్రలు

Dharmapuri Sanjay | కాంగ్రెస్‌లో చేరిన 24 గంటల్లోనే డీఎస్ ఎందుకు రాజీనామా చేశాడు? బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడా?

AP Politics | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు దేవుడు రాసిన స్క్రిఫ్టే ట్రెండింగ్.. వచ్చే ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందా.. చంద్రబాబుకు బొక్క పడనుందా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News