Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsIndian Railways | రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీ రద్దు చేసి రూ.2వేల కోట్లు సంపాదించుకున్న...

Indian Railways | రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీ రద్దు చేసి రూ.2వేల కోట్లు సంపాదించుకున్న కేంద్రం

Indian Railways | రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు సీనియర్ సిటిజన్ కోటా కింద ఒకప్పుడు సబ్సీడి ఉండేది. కానీ కరోనా తర్వాత ఈ రాయితీని కేంద్రం తొలగించింది. దీంతో దాదాపు 8 కోట్ల మంది వృద్ధులు రాయితీకి దూరమయ్యారు. దీని ద్వారా భారతీయ రైల్వే శాఖ భారీగా ఆదాయం సమకూర్చుకుంది. ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2,242 కోట్లు అదనంగా ఆదాయం సంపాదించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ ద్వారా వేసిన దరఖాస్తుకు అధికారులు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

రైల్వేలో ప్రయాణించే 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50 శాతం చొప్పున టికెట్ ధరలో రాయితీ ఇచ్చేవాళ్లు. అయితే కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీని కట్ చేసింది. దీంతో 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు దాదాపు 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు రాయితీకి దూరమయ్యారు. వీరిలో 4.6 కోట్ల మంది పురుషులు, 3.3 కోట్ల మంది మహిళలు, 18 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కాగా, కరోనా సమయంలో రద్దు చేసిన ఈ రాయితీని పునరుద్ధరించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

RCB vs LSG | బదులు తీర్చుకున్న బెంగళూరు.. లక్నోపై ఘనవిజయం

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News