Friday, March 31, 2023
- Advertisment -
HomeLifestyleDevotionalLord Ganesh | గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వినియోగించరు?

Lord Ganesh | గణపతి పూజలో తులసి ఆకులను ఎందుకు వినియోగించరు?

Lord Ganesh | హిందువులు తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. పసుపు కుంకుమను చల్లగా చూడమని మహిళలు రోజూ పూజ చేస్తుంటారు. ఆయుర్వేద పరంగా కూడా తులసిని సర్వ రోగ నివారిణిగా భావిస్తారు. అలాంటి ఎంతో మహత్తు కలిగిన తులసిని గణపతి పూజకు వినియోగించరు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే లంబోదరుడికి సమర్పిస్తారు. మిగిలిన రోజుల్లో తులసి ఆకులను సమర్పిస్తే పాపమని భావిస్తారు. ఇలా తులసీ దళాలను గణపతి పూజకు వాడకపోవడానికి పురాణాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణు అంశ వల్ల కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు ధ్యానంలో ఉన్న వినాయకుడిని చూసి మోహిస్తుంది. వెంటనే గణేశుడి దగ్గరకు వెళ్లి సపర్యలు చేస్తుంది. నచ్చిన వరుడి కోసం వెతుక్కుంటూ వచ్చానని.. తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. అందుకు గణేశుడు నిరాకరిస్తాడు. అప్పుడు నీకు ఇష్టం లేకుండానే రెండు పెళ్లిళ్లు అవుతాయని గణేశుడిని తులసి శపిస్తుంది. దీంతో ఆగ్రహించిన గణపతి ప్రతిశాపం పెడతారు. ఒక రాక్షసుడిని పెళ్లాడి జీవితాంతం అష్టకష్టాలు పడతావని.. సంతానం లేకుండానే మరణిస్తావని వినాయకుడు ప్రతిశాపం పెడతాడు.

వినాయకుడి మాటలతో విచారంలోకి వెళ్లిన తులసి.. క్షమించమని, శాపాన్ని ఉపసంహరించుకోమని వేడుకుంటుంది. కానీ శాపం ఉపసంహరించలేమని చెబుతాడు. కానీ ఈ జన్మ తర్వాత ఒక వృక్షంగా మారతావని.. అందరితో పూజలు అందుకుంటావని వరమిస్తాడు. అయితే నిన్ను నా పూజకు పనికిరావని చెబుతాడు. అప్పుడు తులసి.. నిన్ను ఎప్పటికీ చేరుకోలేనా అని అడుగుతుంది. దీనికి గణేశుడు బదులిస్తూ కేవలం వినాయక చవితి రోజు మాత్రమే నిన్ను నా పూజకు వాడొచ్చని.. మిగిలిన రోజుల్లో కుదరదని చెబుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి శంఖచూడుడనే రాక్షసుణ్ని తులసి పెళ్లాడుతుంది. అతనితో జీవితాంతం కష్టాలను అనుభవిస్తుంది. ఈ జన్మ తర్వాత తులసి మొక్కగా అవతరిస్తుంది. అందుకే వినాయక చవితి రోజు మినహా గణపతి పూజకు తులసి ఆకులను ఉపయోగించరు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News