Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalVasant Panchami | వసంత పంచమి రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యసం ఎందుకు చేయిస్తారు?

Vasant Panchami | వసంత పంచమి రోజు చిన్న పిల్లలకు అక్షరాభ్యసం ఎందుకు చేయిస్తారు?

Vasant Panchami | వసంత పంచమి మాఘమాసం మొదలైన తర్వాత ఐదో రోజు వస్తుంది. ఇది శీతాకాలం ముగింపు, వసంత కాలం ప్రారంభాన్ని చూపిస్తుంది. ఈ ఏడాది హిందూ క్యాలెండర్ ప్రకారం వసంత పంచమి ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 : 34 గంటలకు ప్రారంభమై.. 26వ తేదీ ఉదయం 10:28 గంటలకు ముగుస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి గురువారం నాడే వసంత పంచమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతీ దేవి జన్మించినట్టుగా నమ్ముతారు. అందుకే ఈపర్వదినాన సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. సకల విద్యల్లోనూ శుభం కలగాలని సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యసం చేయించడం వల్ల చదువుల్లో రాణిస్తారని ఆశిస్తారు.

సరస్వతి పూజకు ఇవి మరిచిపోవద్దు

సరస్వతి దేవి పూజా సమయంలో కొత్త పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు దగ్గర ఉంచుకోవాలి. కళా, సాహిత్య రంగాల వారు తమకు సంబంధించిన వస్తువులను దగ్గర ఉంచుకోవాలి. ఈ రోజున పసుపు వస్త్రాలు ధరించడంతో పాటు పసుపు వర్ణంలో ఉండే చీరలు, పువ్వులు, మిఠాయిలను సమర్పిస్తే శుభ ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.

చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్ర గ్రహాల దోషాలు ఉన్న వారు వసంత పంచమి నాడు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆయా గ్రహాల ప్రతికూలతను తప్పించుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇవాళ సాత్విక ఆహారమే తీసుకోవాలి. మద్యం, మాంసాహారం జోలికి పోకూడదు. వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి. దీనివల్ల సరస్వతి దేవీ ఆశీస్సులు పొందడమే కాకుండా కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News