Advantage of cycle | ఇరవై ఏళ్ల క్రితం వరకు రోడ్డుపై ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా సామాన్యుడి వాహనంగా ఒక వెలుగు వెలుగింది. ఎప్పుడైతే కార్లు, బైకులు వాడకం పెరిగిందో సైకిళ్లు కనుమరుగవడం ప్రారంభమైంది. వాటినుంచి వెలువడే కాలుష్యం.. పర్యావరణంపై ప్రభావం చూపించడం మొదలైంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సైకిల్ వాడకం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
అందులో భాగంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల్లో ప్రత్యేకంగా సైకిల్ ట్రాకులను ఏర్పాటు చేస్తున్నాయి. ఢిల్లీ నోయిడాలాంటి ప్రదేశాల్లో సైకిళ్ల కోసం ఇప్పటికే ప్రత్యేక ట్రాకులు ఏర్పాటు చేశారు. ఫలితంగా అక్కడ సైకిళ్ల వాడకం పెరిగింది. సైకిళ్ల వాడకం వల్ల పర్యావరణానికి మేలు కలగడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలున్నాయి.

Advantage of Cycle :
- మోటారు వాహనాలతో పోలిస్తే సైకిల్ నడిపేవారికి జరిగే ప్రమాదాలు తక్కువ. ఒకవేళ అనుకోని ప్రమాదాలు జరిగినా ప్రాణాలు పోయే అవకాశమైతే ఉండదు.
- కాళ్లతో పెడల్ తొక్కుతూ సైకిల్ నడపడం వల్ల కాళ్లు, నడుము బలంగా తయారవుతాయి. చేతులు పటిష్టంగా తయారవుతయాయి.
- గుండె జబ్బులు, బీపీ, షుగర్ వంటి సమస్యలు దరిచేరవు. కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువేనని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
- ప్రతిరోజూ సైకిల్ వాడేవారిలో నిద్రలేమి సమస్య కూడా ఉండదు. ఎందుకంటే సైకిల్ మంచి వ్యాయామ సాధనంగా ఉపయోగపడి, శరీరం అలసిపోయి త్వరగా నిద్రపడుతుంది.
- సైక్లింగ్ వల్ల మెదడు చురుకుగా పనిచేయడమే కాదు.. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
- సైకిల్ తొక్కడం వల్ల శరీరంలో పెరిగిన అధిక కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. శరీరం ఫిట్ గా ఉంటుంది.
సైకిల్ గురించి వింతలూ.. విశేషాలు
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సైకిల్ ధర 5 లక్షల డాలర్లు. అంటే దాదాపు రూ.4లక్షలు. బ్రిటీష్ ఆర్టిస్ట్ డామీన్ హిర్ట్స్ బటర్ ప్లై బైక్ పేరుతో దీన్ని రూపొందించారు.
- ప్రపంచంలో అత్యధికంగా సైకిల్ వాడే వాళ్లున్న దేశం చైనా. అక్కడ 50 కోట్ల సైకిళ్లు వాడుకలో ఉన్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా సైకిళ్ల వాడకం వల్ల ఏటా 90కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతోంది.
- ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్ పొడవు 137 అడుగులు. 20 సీట్ల సామర్థ్యం ఉన్న సైకిల్ ను టాండెమ్ సైకిల్ గా పిలుస్తారు.
- విమానాన్ని రూపొందించిన రైట్ బ్రదర్స్ కు సైకిళ్ల వ్యాపారం చేసేవారు.
- సైకిల్ రేసులకు వేదికగా ఫ్రాన్స్ నిలుస్తోంది. ఇక్కడ టూర్ డి ఫ్రాన్స్ పేరుతో 1903 నుంచి ఏడాదికోసారి మూడు వారాలపాటు సైకిల్ రేసులు జరుగుతాయి. ప్రపంచం నలుమూలల నుంచి ఈ రేసుల్లో పాల్గొనేందుకు సైక్లిస్టులు ఇక్కడికి వస్తుంటారు.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?