Saturday, April 27, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalBanana Tree | అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Banana Tree | అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Banana Tree | అరటి చెట్టును నారాయణుడి స్వరూపంగా భావిస్తారు. కానీ దీన్ని ఇంట్లో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కొందరైతే అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవడం అశుభంగా కూడా భావిస్తారు. మరి నిజంగా అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవడం అశుభమా? నిజం చెప్పాలంటే అరటి చెట్టును పెంచుకోవడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. దాన్ని కరెక్ట్ ప్లేస్‌లో పెంచకపోతేనే లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఈ కారణంతోనే అరటి చెట్టును ఇంట్లో పెంచుకోవద్దని చెబుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను అనుసరిస్తే అరటి చెట్టును పెంచుకుంటే అద్భుతమైన లాభాలు కనిపిస్తాయి. మరి ఆ నియమాలేంటో ఒకసారి చూద్దాం..

ఈ దిశలోనే పెంచాలి..

అరటి చెట్టును ఈశాన్య దిక్కులో నాటితే మంచిది. ఈశాన్యంలో కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిశలో కూడా నాటవచ్చు. అలా అని అరటి చెట్టును ఎప్పుడూ ఇంటి ముందు భాగంలో నాటకూడదు. ఇంటి వెనుక భాగంలోనే దీన్ని పెంచాలి. సింహద్వారం ముందు అరటిని పెంచడం వల్ల సానుకూల శక్తి రావడాన్ని అడ్డుకుంటుంది. ఆగ్నేయ దిశలో కూడా దీన్ని పెంచకూడదు. పశ్చిమ దిశలో పెంచితే కూడా చెడు జరుగుతుంది.

తులసి చెట్టు పక్కన పెట్టాలి

అరటి చెట్టును విష్ణుమూర్తి నివాసంగా నమ్ముతారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి అరటి చెట్టు దగ్గర తులసి మొక్కను నాటితే మంచిది. దీనివల్ల లక్ష్మీదేవి, నారయణుడు ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. అరటి చెట్టు దగ్గరలో ముళ్లు ఉండే మొక్కలను పెంచవద్దు. దీనివల్ల ఇంట్లో విబేధాలు తలెత్తుతాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

అరటి చెట్టును పెంచేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ శుభ్రమైన నీటినే అరటి చెట్టుకు పట్టాలి. బట్టలు ఉతికిన, గిన్నెలు తోమిన నీటిని పోయవద్దు. స్నానం చేసిన నీటిని కూడా అరటి చెట్టుకు పట్టవద్దు. చెట్టు చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడూ తీసివేయాలి.

లాభాలేంటి?

అరటి మొక్కను ఇంటి ఆవరణలో నాటడం వల్ల గురు గ్రహం అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉంటే సుఖసంతోషాలతో ఉండవచ్చు. పెళ్లికాని అమ్మాయిలకు త్వరలో పెళ్లి అవుతుందని కూడా నమ్ముతారు. అరటి చెట్టుకు రోజూ శుభ్రమైన నీటిని పోసి పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News