Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowVasthu tips | పడుకునేటప్పుడు ఈ దిక్కున తలపెడితే మరణాన్ని ఆహ్వానించినట్టే

Vasthu tips | పడుకునేటప్పుడు ఈ దిక్కున తలపెడితే మరణాన్ని ఆహ్వానించినట్టే

Vasthu tips | ఇంటికి మాత్రమే కాదు మనం చేసే పనులకు కూడా వాస్తు ఉంటుంది. ముఖ్యంగా పడుకునేటప్పుడు వాస్తును తప్పనిసరిగా చూడాలంట. సరైన ప్రాంతంలో సరైన దిక్కు తలపెట్టి పడుకోవాలంటే. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దిక్కున తల పెట్టి పడుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

వాస్తు ప్రకారం పడకగది ఇంటికి పశ్చిమ, దక్షిణ దిశలో కట్టుకోవాలి. నైరుతి మూలలో బెడ్రూం ఉంటే మరీ మంచిది. ఇంట్లో పెద్దవారికి నైరుతి దిశలో పడక గది నిర్మిస్తే.. పిల్లలకు దక్షిణం లేదా పశ్చిమ దిశలతో పాటు వాయువ్యంలో మరో బెడ్రూం కట్టుకోవచ్చు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకోకూడదు. ఎందుకంటే లేవగానే మనకు దక్షిణం కనిపిస్తుంది. ఇది యమస్థానం. అంటే ఉత్తరం దిక్కు తల చేసి పడుకుంటే మరణాన్ని ఆహ్వానించినట్టేనని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూర్వం ఆగ్రహానికి గురైన శివుడు.. తన శూలంతో వినాయకుడి శిరచ్ఛేదనం చేశాడు. అనంతరం తిరిగి తలను అతికించే క్రమంలో ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న జీవి తలను తీసుకురావాలని అప్పుడు శివుడు ఆదేశించాడు. దీంతో ఉత్తరం వైపు తలచేసి పడుకున్న ఏనుగు తలను నరికి తీసుకొస్తారు. అలా ఆ ఏనుగు అకాల మరణం చెందింది. అందుకే ఉత్తరం దిక్కు తల చేసి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుందని అంటారు.

ఉత్తరంతో పాటు పశ్చిమ దిశగా కూడా తలపెట్టి పడుకోవద్దు. ఈ దిక్కున తలపెట్టి పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మధ్యలో లేవడం ఎక్కువగా జరుగుతుంది. తరచూ నిద్రలేమితో బాధపడాల్సి వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

తూర్పు వైపు తలపెట్టి పడుకుంటే మంచిది. నిద్ర బాగా పడుతుంది. అలాగే దక్షిణం దిక్కు తలపెట్టి పడుకుంటే అదృష్టం కలిసివస్తుంది. ఎందుకటే దక్షిణం దిక్కు తలపెడితే ఉదయం లేవగానే ఉత్తరం కనిపిస్తుంది. ఇది కుబేరుడి స్థానం. కాబట్టి నిద్ర లేవగానే ఈ వైపు చూడటం అదృష్టకారకమని శాస్త్రం తెలుపుతోంది. దీనివల్ల కుటుంబానికి లక్ష్మీ కటాక్షంతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vasthu Shastra | ఇంటి గడప మీద కూర్చుంటే అరిష్టమా? సైన్స్ ఏం చెబుతోంది?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News