Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsWhatsapp | వాట్సాప్‌ గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయినట్టు వస్తుందా? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి

Whatsapp | వాట్సాప్‌ గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయినట్టు వస్తుందా? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి

Whatsapp | వెబ్‌ వాట్సాప్‌ యూజర్లు ఈ మధ్య తరచుగా ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. ఏదైనా గ్రూపులో మెసేజ్‌ చేద్దామని చూస్తే.. మీరు ఈ గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయ్యారు. కాబట్టి ఇందులో మీరు మెసేజ్‌ చేయలేరని చూపిస్తుంది. దీంతో కంగారు పడిపోయిన యూజర్లు మొబైల్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేస్తే అందులో మామూలుగానే ఉంటుంది. ఈ సమస్యను ఇటీవల చాలామందే ఎదుర్కొన్నారు. అసలు ఇలా ఎందుకు అవుతుందో తెలియక చాలామంది తికమక పడిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలియక అయోమయంలో పడిపోతున్నారు.

వాట్సాప్‌ వెబ్‌లో వచ్చిన ఈ సమస్య గురించి ఇప్పటివరకు వాట్సాప్‌ కంపెనీ మెటా నుంచి స్పందన రాలేదు. కాకపోతే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలో టెక్‌ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఒకవేళ ఈ సమస్య ఎదురైతే వెంటనే వాట్సాప్‌ వెబ్‌ నుంచి లాగవుట్‌ చేసి.. తిరిగి లాగిన్‌ అవ్వండి. అప్పుడు సమస్య తీరిపోతుంది. అయినా అలాగే వస్తే.. మరోసారి ప్రయత్నిస్తే సెట్‌ అవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు మరో టెక్నిక్‌ కూడా ఉంది. ఎప్పుడైతే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయ్యారని వస్తుందో.. అప్పుడు మీ మొబైల్‌లో ఆ వాట్సాప్‌ గ్రూప్‌ ఓపెన్‌ చేయండి. అందులో ఏదైనా ఒక మెసేజ్‌ చేయండి. ఆ మెసేజ్‌ సెండ్‌ అయ్యాక వాట్సాప్‌ వెబ్‌లో చూస్తే సమస్య తీరిపోతుంది. తొలి ప్రయత్నంలో కాకుంటే సెకండ్‌ అటెంప్ట్‌ చేసినప్పుడు కచ్చితమైన ఫలితం ఉంటుందని టెక్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Whatsapp | పొరపాటున వాట్సాప్ మెసెజ్ డిలీట్ చేశారా? ఇలా రికవరీ చేసుకోండి

Smartphone hacks | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదు మార్పులు గమనించారా? అయితే మొబైల్‌ హ్యాక్‌ అయినట్టే

Most Dangerous web browser | మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు? ఈ ఏడాదిలో అత్యంత ప్రమాదకరమైన బ్రౌజర్ ఇదేనంట !

World’s smallest tv | వేలంతా కూడా లేని బుల్లి టీవీ.. దీని ధర ఎంతో తెలుసా

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News