Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (27-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (27-02-2023 )

Horoscope Today | మేషం

అన్నింటికీ ధనమే మూలమని నిరూపించే విధంగా సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంస్థను విస్తృత పరచడానికి మీరు తీసుకునే చర్యలు లాభిస్తాయి. వివాదాల్లోకి మిమ్మల్ని లాగబడే యత్నాలు సాగుతాయి.

వృషభం

పట్టువిడుపు ధోరణిని కనబరుస్తారు. క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా మెలుగుతారు. ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధిస్తారు. ఎదుటివారు చెప్పేది ప్రశాంతంగా వింటారు.

మిథునం

గతంలో దూరమైన స్నేహితులు తిరిగి దగ్గరవుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నిష్కర్షగా వ్యవహరిస్తారు. టెండర్స్, జాబ్ వర్క్స్ ఎగుమతి ఆర్డర్లు అనుకూలిస్తాయి.

కర్కాటకం

సహోదర, సహోదరీ వర్గానికి మీ వంతు సహాయసహకారాలు అందిస్తారు. అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి ప్రవేశం కల్పించకండి. ఆశించిన రుణాలు మంజూరవుతాయి.

సింహం

దీర్ఘాలోచనలు చేస్తారు. లిఖిత పూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చర్యలు చేపడతారు. ఉన్నత విద్యావకాశాలపై దృష్టి సారిస్తారు.

కన్య

స్నేహితుల సహకారం లభిస్తుంది. చతురోక్తులతో కూడిన సంభాషణలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

తుల

కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. వీసా, పాస్‌పోర్టు వంటి అంశాలు సానుకూలన పడతాయి. దరఖాస్తులు పంపేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోండి.

వృశ్చికం

సందర్బోచితంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ పనులు నిదానంగా సాగుతాయి. దూరంగా ఉన్న ఆత్మీయులతో సంభాషణలు సాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ధనుస్సు

న్యాయంగా మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విదేశీయాన యత్నాలు కలిసి వస్తాయి. సంతాన విషయం పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు.

మకరం

చెల్లింపుల విషయంలో మెలకువ అవసరం. మీ వైఖరిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. లాభాలు పొందుతారు.

కుంభం

జాయింట్ ఖాతాలు ప్రారంభిస్తారు. సంభాషణలు, చర్చలు సంప్రదింపులతో క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయసహకారాలు అందుకుంటారు.

మీనం

మీ అంచనాలు చాలావరకు నిజమవుతాయి. విధానపరమైన ముఖ్య విషయాలను సానుకూలపడతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా పరిణమిస్తుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News