Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు 17-10-2022

Horoscope Today | రాశిఫలాలు 17-10-2022

Horoscope Today | మేషం

అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అందర్నీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. సమీప బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఎవరి నుంచి ఏవీ ఆశించకపోవడమే మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు.

వృషభం

ఈరోజు కలిసిసొస్తుంది. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. రుణబాధ తొలగుతుంది. ఆదాయం పెరగుతుంది అనామక స్త్రీలతో పరిచయానికి దూరంగా ఉండండి. స్థాన చలన సూచన ఉంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయసంగా విజయం సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి.

మిథునం

వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. కొత్త ఆదాయమార్గం ఏర్పడుతుంది. స్నేహితులతో విబేధాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి.

కర్కాటకం

ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పనిభారం తగ్గే సూచనలున్నాయి.

సింహం

కొత్త ఉద్యోగవకాశాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. తొందరపాటు తగదు.

కన్య

ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భార్యాపిల్లలతో వివాహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయసంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభించనుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

తుల

ఆదాయం పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు కనిపిస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృశ్చికం

ఆదాయం పెరుగుతుంది. డబ్బు దుర్వినియోగం అవుతుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్థిరాస్తి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానయోగానికి సంబంధించి తీపికబురు వస్తుంది. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణాలు చేయాల్సి వస్తుంది

ధనుస్సు

ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు సునాయసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లు, డాక్టర్లకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు.

మకరం

ధన, వస్తు లాభం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. అనుకున్న వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి ఉంటుంది.

కుంభం

ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాగా నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలుచేస్తారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురుచూపులు తప్పవు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News