Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentSamantha | గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. ఫొటోలు వైరల్

Samantha | గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. ఫొటోలు వైరల్

Samantha | మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ఇప్పుడు కెరీర్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఒకవైపు కమిట్ అయిన వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తూనే.. తనను తాను ఫిట్‌గా మార్చుకుంటుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. ఏ మాత్రం రెస్ట్ లేకుండా కష్టపడుతోంది. ఆ విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ డీకే దర్శక ద్వయం తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. ఈ మధ్యే ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో సమంత జాయిన్ అయ్యింది. హాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్‌కు ఇండియన్ వెర్షన్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇందులో సమంత పలు పోరాట సన్నివేశాల్లోనూ నటించాల్సి ఉంటుంది. అందుకే ఆ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. జిమ్‌లో భారీగా కసరత్తులు చేస్తూ ఫిట్‌గా తయారవుతోంది. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటుంది. దానికి సంబంధించిన పిక్స్‌నే రీసెంట్‌గా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మొన్నటి దాకా ఇమ్యూనిటీ డిజార్డర్‌తో బాధపడిన సమంత ఇప్పుడు పూర్తిగా కోలుకుని సినిమాలతో బిజీ కావడం పట్ల అభిమానులు సంబరపడుతున్నారు. సామ్‌ను తిరిగి ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం ఈ సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News