Thursday, May 2, 2024
- Advertisment -
HomeEntertainmentGurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Gurtunda seetakalam Review | విలక్షణ పాత్రలకు ఇప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు సత్యదేవ్‌. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలన్‌గా, సపోర్టింగ్‌ రోల్స్‌లోనూ నటిస్తున్నాడు. ఏ పాత్ర ఇచ్చినా సరే దానిలో జీవించేస్తానని నిరూపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గుర్తుందా శీతాకాలం అనే లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్నడలో బ్లాక్‌బస్టర్‌ అయిన లవ్‌ మాక్‌టెయిల్‌ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. స్టార్ హీరోయిన్‌ తమన్నా ఈ సినిమాలో నటించింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి శీతాకాలంలోనే వచ్చిన గుర్తుందా శీతాకాలం సినిమా ప్రేక్షకులను అలరించిందా? ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా ఫీలయ్యేలా చేసిందా? లేదా ఇప్పుడు చూద్దాం..

కథ

దేవ్‌ అలియాస్‌ సత్యదేవ్‌ ( సత్యదేవ్ ‌) జీవితంలోని మూడు ప్రేమకథలే ఈ సినిమా స్టోరీ. మధ్యతరగతి కుటుంబానికి చెందిన దేవ్‌ స్కూల్‌ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కాలేజీ డేస్‌లో ధనవంతుల అమ్మాయి అయిన అమ్మూ అలియాస్‌ అమృత ( కావ్య శెట్టి )తో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రాణంగా ప్రేమిస్తాడు. అమ్మూని పెళ్లి చేసుకోవాలని ఆమె కోసం బెంగళూరులో జాబ్‌ కూడా తెచ్చుకుంటాడు. కానీ అతనికొచ్చే అరకొర జీతంతో బతకడం కష్టమని కావ్య తల్లిదండ్రులు ఆమెకు బ్రెయిన్‌ వాష్‌ చేస్తారు. దీంతో ఆమె కూడా క్యాలిక్యులేట్ చేసుకుని దేవ్‌తో వర్కవుట్‌ కాదని అనుకుంటుంది. అతన్ని అవమానించి, బ్రేకప్‌ చెబుతుంది. ఆ బాధలో ఉన్నప్పుడే దేవ్‌ జీవితంలోకి నిధి ( తమన్నా ) వస్తుంది. నిధితో అయినా దేవ్‌ లవ్‌స్టోరీ సక్సెస్‌ అయ్యిందా? తన ప్రయాణంలో కలిసిన దివ్య ( మేఘా ఆకాష్‌ )కు దేవ్‌ కథతో సంబంధమేంటి? అనేది మిగిలిన స్టోరీ.

ఎలా ఉందంటే..

దేవ్‌ జీవితంలో మూడు దశల్లో ఎదురైన లవ్‌స్టోరీలే గుర్తుందా శీతాకాలం సినిమా. ఇలాంటి కాన్సెప్ట్‌ మూవీస్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. నా ఆటోగ్రాఫ్‌, ప్రేమమ్‌ వంటి చాలా సినిమాల్లో ఇలాంటి లవ్‌స్టోరీలను ప్రేక్షకులు చూశారు. అయితే ఇందులో కొత్తదనమేంటి అంటే.. తన ప్రయాణంలో కలిసిన దివ్య అనే అమ్మాయికి దేవ్‌ తన లవ్‌స్టోరీలను చెబుతుంటాడు. అదొక్కటే కొత్త పాయింట్‌. ఇలాంటి లవ్‌స్టోరీలు ఆకట్టుకోవాలంటే సినిమాలో ఫీల్‌ ఉండాలి. తెరపై కనిపించే లవ్‌స్టోరీ ప్రేక్షకుల మనసులకు హత్తుకోవాలి. అప్పుడే ఆ ఫీల్‌ను తీసుకురాగలరు. కానీ కథలో అది మిస్సయింది. మాతృకను యథావిధిగా చూపించే ప్రయత్నం చేశారు.

ఫస్టాప్‌లో వచ్చే స్కూల్‌, కాలేజీ డేస్‌ లవ్‌స్టోరీలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అమ్మూని పడేయడానికి సత్యదేవ్‌ చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. గత సినిమాల్లోని సీన్లను గుర్తుచేసేలా ఉన్నప్పటికీ ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథలో నిధి, దేవ్‌ లవ్‌స్టోరీనే కీలకం. సెకండ్‌ హాఫ్‌ మొత్తం వీళ్ల లవ్‌స్టోరీ మీదనే నడుస్తుంది. అయితే ఫీల్‌ మిస్సవ్వద్దని మాతృకలో ఉన్న సీన్లను అలాగే తీసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ లవ్‌స్టోరీలోని ఫీల్‌ను మాత్రం డైరెక్టర్‌ తీసుకురాలేకపోయాడు. ఎమోషన్‌గా సాగే సీన్లు లేకపోవడం, సాగదీసినట్టుగా ఉండటం ప్రేక్షకులకు కొంత చికాకు తెప్పిస్తాయి. ఇక సినిమా ప్రమోషన్‌లో దీన్ని గీతాంజలితో ఎందుకు పోల్చారనేది క్లైమాక్స్‌లో మనకు అర్థమవుతుంది. విషాద సన్నివేశాలు, సెంటిమెంట్‌తో క్లైమాక్స్‌ను తీర్చిదిద్దాలని అనుకున్నారు. కానీ అందులో కొత్తదనమేమీ లేదు.

ఎవరెలా చేశారంటే..

సత్యదేవ్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు విలక్షణ పాత్రల్లో కనిపించిన సత్యదేవ్‌.. ఇందులో లవ్‌స్టోరీలో ఒదిగిపోయాడు. స్కూల్‌ డేస్‌, కాలేజీ డేస్‌లో, పెళ్లయిన తర్వాత ఇలా డిఫరెంట్‌ దశలకు సంబంధించిన వేరియేషన్‌ లో చాలా బాగా నటించాడు. నిధి పాత్రలో తమన్నా కూడా జీవించింది. క్లైమాక్స్‌ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. చాలారోజుల తర్వాత ప్రియదర్శికి మంచి పాత్ర దక్కింది. కామెడీతో నవ్వించాడు. అమ్మూ పాత్రకు కావ్యశెట్టి న్యాయం చేసింది. ధనవంతులు అమ్మాయిగా పాత్రలో ఒదిగిపోయింది. మేఘా ఆకాశ్‌ పాత్ర మేరకు నటించింది. అతిథి పాత్రలో సుహాసిని కనిపించింది. లక్ష్మీ భూపాల అందించిన డైలాగులు బాగున్నాయి. పాటల విషయానికొస్తే గుర్తుపెట్టుకునేంతగా ఏమీ లేవు. కెమెరా పనితనం, ఎడిటింగ్‌ బాగున్నాయి.

బలాలు

+ సత్యదేవ్‌, తమన్నా నటన
+ ఫస్టాఫ్‌ కామెడీ సీన్లు

బలహీనతలు

– సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు

చివరగా.. గుర్తుండిపోయే అంత సీన్‌ ఏం లేదు

Follow Us : FacebookTwitter

Read More Articles |

Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Theri Remake | మాకొద్దు బాబోయ్ ఆ రీమేక్.. పవన్ కళ్యాణ్ సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News