Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentIndian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Indian cinema | ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ ( bollywood ) మాత్రమే అనుకునేవారు. బాహుబలి ( bahubali ) సినిమాతో దేశం మొత్తం టాలీవుడ్ ( tollywood ) మీద ఫోకస్ పెట్టింది. బాహుబలి 2తో బాలీవుడ్ షేకయిపోయింది. అది క్రియేట్ చేసిన సెన్సేషన్ నుంచి ఇప్పటికీ బాలీవుడ్ బయటపడలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ ( KGF ) , కేజీఎఫ్ 2 ( KGF 2 ) చిత్రాలు శాండిల్ వుడ్ ( Sandalwood ) సత్తాను చూపించడమే కాదు.. బాలీవుడ్ లో చాలామందికి నిద్రలేకుండా చేశాయి.

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా కూడా భారతీయ సినీ చరిత్రలో సంచలనాలు క్రియేట్ చేసింది. అటు బాలీవుడ్ లో మాత్రం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోల చిత్రాలు కూడా వీటి దాటికి తట్టుకోలేకపోయాయి. చివరికి నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2తో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా పోటీ పడి మరీ వెనకబడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే స్థాయి నుంచి ప్రాంతీయ చిత్రాలే రాజ్యమేలే పరిస్థితి వచ్చింది.

Read more: Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

కన్నడ సినిమాల గురించి ఒకప్పుడు చాలా చీప్ గా మాట్లాడుకునేవారు. ఇక్కడి నుంచి సినిమాలకు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావు అని ఎగతాళి చేసే వాళ్లు. ఇప్పుడు ఇక్కడి డైరెక్టర్స్, హీరోల గురించి మాట్లాడని వాళ్లు లేరు. ముఖ్యంగా గత మూడు నాలుగు ఏళ్లుగా కన్నడ సినిమా ఇండస్ట్రీ ఎదుగుతున్న తీరు చూసిన తర్వాత అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దక్షిణాదిలో తెలుగు, తమిళ, మలయాళం తర్వాత స్థానంలో కన్నడ సినిమాలు ఉండేవి. స్టార్ హీరోల బడ్జెట్.. టాలీవుడ్ లో మీడియం హీరోల బడ్జెట్ కంటే తక్కువగా ఉండేది. వాళ్లకు 40 కోట్ల షేర్ వస్తే అదేదో గొప్ప విషయంగా ఉండేది.. కానీ మన దగ్గర 40 కోట్లు తొలిరోజు వసూలు చేసే సినిమాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి నుంచి ఒకే ఒక్కడు కన్నడ సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తును మార్చేశాడు. అతడి పేరు ప్రశాంత్ నీల్.. ఆ సినిమా కేజిఎఫ్.

Read more: Hidimba Devi Temple | దేవతలకే కాదు రాక్షస సంతతికి చెందిన హిడింబికి గుడి.. ఈ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వారికి పెళ్లవుతుందట..

4 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా అది సృష్టించిన సంచలనం చాలా మందికి నిద్ర లేకుండా చేసింది. కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు పెంచేసింది. అందుక తగ్గట్టే పార్ట్ 2 ఏకంగా 1200 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఎవడ్రా కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడేది అన్నట్టు కాలర్ ఎగరేసింది.

Read more: vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

ఆ తర్వాత కూడా విక్రాంత్ రోనా, గరుడ గమన వృషభ వాహన లాంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ గురించి మరోసారి చర్చించేలా చేశాయి. ఇక తాజాగా విడుదలైన కాంతార ( Kantara ) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పూర్తిగా కన్నడ సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కన్నడలో కేవలం 10 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. హిందీ, తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుంది. కాంతార విజయం చూసిన తర్వాత కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.

Read more: T20 world cup records | టీ20 ప్రపంచకప్‌లో నమోదైన రికార్డులు ఇవే.. అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్న క్రికెటర్‌ ఎవరంటే ?

ఆ సినిమా కథ, కథనం పక్కన పెడితే.. టెక్నికల్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో కన్నడ ఇండస్ట్రీ మిగిలిన వాటికంటే ఎంత అడ్వాన్స్డ్ గా ఉంది అనేది అర్థమవుతుంది. ఈ సినిమాలు తెరకెక్కుతున్న తీరు చూసిన తర్వాత కన్నడ ఇండస్ట్రీని ఇకపై ఎవరైనా పన్నెత్తి ఒక మాట అనాలన్నా.. కన్నెత్తి చూడాలన్న ఒకటికి పది సార్లు ఆలోచించక తప్పదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News