Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (10-12-2022 )

Horoscope Today | రాశిఫలాలు (10-12-2022 )

Horoscope today | మేషం

చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతుంది. సంఘంలో విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన ఉంది.

వృషభం

పనుల్లో ఒత్తిడి ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు చాలా దూరంగా ఉండండి. సోదరులను కలుసుకుంటారు.

మిథునం

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగం ఉంది.

కర్కాటకం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ధనలాభ సూచన ఉంది.

సింహం

పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. గోసేవ చేయడం శుభదాయకం.

కన్య

చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల

వ్యక్తిగత సమస్యలు ఎదురై చికాకు పెట్టినా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయత్నాల్లో నూతన మిత్రుల పరిచయాల ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. ఆరోగ్యం విషయంలో మెళుకువ అవసరం.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి. వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మకరం

మానసిక ప్రశాంతత పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కళా, రాజకీయ రంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందే సూచన ఉంది. సంతానానికి ఉద్యోగ యోగం ఉంది.

కుంభం

వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు కొంతవరకు తొలగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో ఎదురైన వివాదాలను పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

మీనం

వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. నూతన ప్రయత్నాల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తొలగి లబ్ధి పొందుతారు. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. వస్తు లాభం ఉంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News