Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentSamantha | ఊపిరి పీల్చుకో పాప..ఇన్ని రోజులు పడ్డ కష్టాలను తలచుకుని తనకు తానే ధైర్యం...

Samantha | ఊపిరి పీల్చుకో పాప..ఇన్ని రోజులు పడ్డ కష్టాలను తలచుకుని తనకు తానే ధైర్యం చెప్పుకున్న సమంత

Samantha | అటు ఉన్న పుల్ల ఇటు పెడితే ఆయాసం.. చేయి పైకి ఎత్తితే అలసట.. కూర్చోలేరు.. నిల్చోలేరు.. అలాంటి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌తో పోరాడింది.. ఎవరి సాయం లేకున్నా ఒంటరిగా పోరాడింది. ఒకవైపు తనపై వస్తున్న విమర్శలు.. మరోవైపు కమిట్ అయిన సినిమాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది. ఇప్పుడు మయోసైటిస్ నుంచి కోలుకుని రొటీన్ వర్క్‌పై దృష్టి పెట్టింది. అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉన్న సినిమాలపై ఫోకస్ చేసి వాటిని కంప్లీట్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఇన్ని రోజులు పడిన కష్టాలను తలచుకుని తనకు తానే ధైర్యం చెప్పుకొంది.

మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ మేకర్స్‌తో కలిసి సిటాడెల్ ప్రాజెక్టులో నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ వెబ్ సిరీస్ సెట్‌లోకి సామ్ అడుగుపెట్టింది. ఈ సందర్భంగానే కొన్ని ఫొటోలను సమంత షేర్ చేసింది. నాగచైతన్యతో విడాకుల నుంచి అనారోగ్యానికి గురవ్వడం వరకు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తలచుకుంటూ ఈ సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. అందులో తనకు తానే ధైర్యం చెప్పుకుంది.

‘గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను ఎదుర్కొన్నావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆ సమయంలో నువ్వు ఆలోచించడం మానేశావు.. దేనిపైనా ఏకాగ్రత పెట్టలేకపోయావు. సరిగ్గా నడవలేకపోయావు.. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగువేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో’ అంటూ తనకు తాను చెబుతున్నట్లు సమంత రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ సమంత పరిస్థితి చూస్తుంటే గత కొంత కాలంగా కష్టాల సాగరాన్ని ఈదుతూ పోరాటం చేస్తున్నట్లు అనిపిస్తోంది. తన పర్సనల్ లైఫ్‌లో ఆమె ఎన్నో సమస్యలతో ఫైటింగ్ చేస్తుంది. ఇదిలా ఉండగా అరుదైన వ్యాధి మయోసైటిస్‌ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది సమంత. ఇప్పుడిప్పుడే మళ్లీ తన సినీ కెరీర్ మీద దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసుకున్న సమంత తాజాగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌ కోసం రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే సమంత ఇటీవల సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు కూడా వైరల్ గా మారాయి. వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సామ్ చేస్తున్న పోస్టింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్ స్టా లో పోస్ట్‌ చేసిన ఓ పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సామ్‌ ప్రస్తుతం… ఫ్యామిలీ మ్యాన్‌ మేకర్స్ నుంచి వస్తోన్న మ్యాన్‌ మేకర్స్‌ నుంచి వస్తోన్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ లో సమంత కూడా జాయిన్‌ కానున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News