Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentTarakaratna | తారకరత్న హెల్త్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన మంచు మనోజ్

Tarakaratna | తారకరత్న హెల్త్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన మంచు మనోజ్

Tarakaratna | గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉంది. ఇంకా ఆయన స్పృహలోకి రాలేదు. అయినప్పటికీ తారకరత్న కోలుకుంటాడని అందరిలోనూ నమ్మకం ఉంది. దీనికి కారణం.. పరిస్థితి విషమంగా ఉన్నా ఆయన చికిత్సకు రెస్పాండ్ కావడమే. ఇదే విషయాన్ని శనివారం దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంచెం అటు ఇటుగా ఇదే చెప్పారు. సోమవారం మరిన్ని పరీక్షలు చేస్తారని.. వాటి ఆధారంగా ట్రీట్‌మెంట్ మారుస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లి తారకరత్నను పరామర్శించాడు మంచు మనోజ్. ఈ సందర్భంగా అతని హెల్త్ అప్‌డేట్ కూడా ఇచ్చాడు.

‘ తారకరత్నను చూశా. రికవరీ అవుతున్నాడు. చిన్నప్పట్నుంచి అతన్ని చూస్తున్నా. మొదట్నుంచి అతను చాలా స్ట్రాంగ్ ఫైటర్. తొందరలోనే తారకరత్న కోలుకుంటాడు. ఎప్పటిలా మనముందుకొస్తాడు. అందరి జీవితాల్లోనూ ఏదో ఒకటి ఉంటుంది. తారకరత్న లైఫ్‌లో ఇదే. అతనికి ఇది టెస్టింగ్ టైమ్. తొందరగానే కోలుకుంటాడు. తిరిగి వస్తాడని 100 శాతం నమ్మకం ఉంది.’ అంటూ మంచు మనోజ్ మీడియాకు తెలిపాడు. మంచు మనోజ్ మాటలు విన్న తర్వాత నందమూరి అభిమానుల్లో కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. అయితే సోమవారం నాడు తారకరత్నకు ఎంఆర్ఐ స్కాన్ చేయనున్నట్టు సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News