Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentChiranjeevi | వాల్తేరు వీరయ్య జోష్.. రెమ్యునరేషన్ డబుల్ చేసేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | వాల్తేరు వీరయ్య జోష్.. రెమ్యునరేషన్ డబుల్ చేసేసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | మెగాస్టార్‌ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో ఫస్ట్‌ టైమ్‌ అదిరిపోయే హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమాతో మాస్‌ కా బాస్‌ అని నిరూపించుకున్నాడు. కలెక్షన్లతో కూడా రికార్డులు సృష్టించాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్కు అందుకుంది. మొత్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో చిరంజీవి తన రెమ్యునరేషన్‌ను రెండింతలు చేసేశాడని ఫిలిం వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్‌ 150 సినిమాను పక్కనబెడితే అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఆ సినిమా కూడా రీఎంట్రీ మూవీ కాబట్టి బాస్‌ను చూడాలని అంతా వచ్చారు. అందులో కాసేపు కామెడీ చేయడంతో ఆ సినిమా అందరికీ నచ్చింది. ఆ తర్వాత సైరా అంటూ పీరియాడికల్ మూవీతో వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత అపజయం ఎరుగని డైరెక్టర్ కొరటాల శివతో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయ్యింది. చిరు కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్‌గా మిగిలిపోయింది. గాడ్ ఫాదర్ కూడా యావరేజ్‌గానే నిలిచింది. ఇవన్నీ సీరియస్ సబ్జెక్ట్స్. మెగాస్టార్‌ను సీరియస్‌గా చూడ్డానికి ఆడియన్స్ ఇష్టపడలేదు. అందుకే వీటిని రిజెక్ట్ చేశారు. కానీ వాల్తేరు వీరయ్యలో మాత్రం రెట్రో చిరంజీవిని చూపించాడు. తన స్టైల్ మాస్ ప్లస్ కామెడీని మళ్లీ టేస్ట్ చేయించాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేశాయి. ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేశారు. దీంతో తనకు మాస్ కామెడీనే సెట్ అవుతుందని ఫిక్సయిపోయాడు. దీంతో పాటు వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్‌తో రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేశాడు.

వాల్తేరు వీరయ్య సినిమా కోసం చిరంజీవి రూ.50 కోట్ల వరకు తీసుకున్నాడు. కానీ ఇకపై కమిట్ అయ్యే సినిమాలకు రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని ఫిలింవర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల కంటే ముందే మొదలు పెట్టేశాడు. కాబట్టి ఈ సినిమాకు ముందు అనుకున్న రెమ్యునరేషన్‌కే చిరు వర్క్ చేస్తున్నాడట. ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియదు గానీ సినీవర్గాల్లో మాత్రం జోరుగా ప్రచారం అవుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్‌

K Viswanath | డైరెక్టర్‌గా కె.విశ్వనాథ్ ఫస్ట్ షాట్ భలే తమాషాగా జరిగింది.. అదే ఆయన్ను కళాతపస్విగా మార్చేసింది.

K.Viswanath | తన మాటకు ఎదురుచెప్పాడని గిరిబాబుకు తన సినిమాల్లో అవకాశమివ్వని కళాతపస్వి

K.Viswanath | ఏఎన్నార్ సినిమా టైమ్‌లో కె.విశ్వనాథ్‌కు భారీ ప్రమాదం.. కొంచెం అయితే ప్రాణాలు పోయేవి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News