Naatu Naatu Song | ఆర్ఆర్ఆర్ సినిమా ( RRR Movie ) చరిత్ర సృష్టించింది. భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డు( Oscars 2023 )ను గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు అందుకుంది. అప్లాజ్ ( టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ ), లిఫ్ట్ మి అప్ ( బ్లాక్ పాంథర్ : వకండా ఫరెవర్ ), దిస్ ఈజ్ ఏ లైఫ్ ( ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్ : మావెరిక్ ) వంటి పాటలు పోటీ పడుతున్నప్పటికీ వాటన్నింటినీ దాటుకుని ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును పాట రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి అందుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
పదాల్లోనే సంగీతం ఉంది : చంద్రబోస్
ఇంత గొప్ప పాట ఎలా రాశారని మీడియా అడిగిన ప్రశ్నకు పాటల రచయిత చంద్రబోస్ ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయని తెలిపారు. తెలుగు భాషలో చాలా అక్షరాలు, చాలా ఫీలింగ్స్, చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని.. అందుకే ఇది గొప్ప భాష అని చెప్పారు. తెలుగు సాహిత్య భాష.. సంగీత భాష అని ఆయన స్పష్టం చేశారు. తెలుగులో మామూలు ఒక్క పదం రాసినా కూడా అందులో సంగీతం ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. తెలుగు వాళ్లకు సాహిత్యం అర్థమవుతుంది కాబట్టి ఇష్టపడతారు.. కానీ భాషతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడతున్నారంటే దానికి ఆ పాటలోని పదాల వెనుక ఉన్న సంగీతమే కారణమని స్పష్టం చేశారు.
గర్వంగా ఉంది : కీరవాణి
నాటు నాటు సాంగ్ కోసం ఆస్కార్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తెలిపారు. ఈ పాట మమ్మల్ని ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని చెప్పారు. ఆస్కార్ రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన చిత్ర బృందం, ఆదరించిన ప్రేక్షకులు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read More ;
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది