Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsMI vs UPW | తిరుగులేని ముంబై.. యూపీ వారియర్స్‌పై గ్రాండ్‌ విక్టరీ

MI vs UPW | తిరుగులేని ముంబై.. యూపీ వారియర్స్‌పై గ్రాండ్‌ విక్టరీ

MI vs UPW | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్లూ్యపీఎల్‌)లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్‌ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), తహిలా మెక్‌గ్రాత్‌ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. దేవిక వైద్య (6), సిమ్రన్‌ (9), సోఫీ ఎకెల్‌స్టోన్‌ (1), దీప్తి శర్మ (7) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖ్‌ 3, అమేలియా కెర్ర్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

ధనాధన్‌ చేజింగ్‌

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (33 బంతుల్లో 53 నాటౌట్‌; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా.. స్కీవర్‌ బ్రంట్‌ (45; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), యస్తిక భాటియా (42; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. టార్గెట్‌ పెద్దది కాకపోవడంతో ముంబై ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. హీలీ మాథ్యూస్‌ (12)తో కలిసి యస్తిక తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించగా.. ఆ తర్వాత స్కీవర్‌, హర్మన్‌ దంచికొట్టారు. ప్రత్యర్థి బౌలర్లలో రాజేశ్వరి, సోఫియా ఎకెల్‌స్టోన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఆడిన నాలుగింట్లోనూ విజయాలే..

ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌ను తలపించేలా మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో హర్మన్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ వరుస విజయాలు సాధిస్తోంది. మెరుగైన ప్లేయర్లు.. అత్యుత్తమ శిక్షణ సిబ్బంది అండగా ఉండటంతో ముంబై అలవోకగా లక్ష్యాలను చేధిస్తోంది. గత మ్యాచ్‌ల్లో వీర లెవల్లో విజృంభించిన హీలీ మాథ్యూస్‌ ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపకపోయినా ముంబై సులువుగా విజయం సాధించగలిగింది. ఈ గెలుపుతో ముంబై నాకౌట్‌ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. మరొక్క విజయం సాధిస్తే.. హర్మన్‌ బృందం అనధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ముంబై ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఢిల్లీ (6 పాయింట్లు), యూపీ వారియర్స్‌ (4 పాయింట్లు), గుజరాత్‌ (2 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్మృతి మంధన నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికల అట్టడుగున నిలిచింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News