Khusboo | సీనియర్ నటి ఖుష్బూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్బూ మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై స్పందించింది. చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని బయటపెట్టింది. కన్నతండ్రే తనను లైంగికంగా వాడుకోవాలని చూశాడని తెలిపింది.
అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చిన్నతనంలో వేధింపులకు గురైతే అది వాళ్లను జీవితాంతం భయబ్రాంతులకు గురి చేస్తుందని ఖుష్బూ తెలిపింది. భార్యాపిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, కన్న కూతురిపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడటం తమ జన్మ హక్కు అని కొంతమంది భావిస్తారని ఆమె చెప్పింది. అలాంటి వాళ్లలో తన తండ్రి కూడా ఒకడని బయటపెట్టింది. తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రే తనను లైంగికంగా వేధించేవాడని తెలిపింది. ఆ సమయంలో ఈ విషయాన్ని అమ్మకు చెబితే నమ్ముతుందో లేదోనని భయపడ్డానని పేర్కొంది. ఎందుకంటే ఏం జరిగినా సరే భర్తే ప్రత్యక్ష దైవం అని భావించే మహిళ తాను అని స్పష్టం చేసింది. నాన్న నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేక 15 ఏళ్ల వయసులో ఎదురించడం మొదలుపెట్టానని తెలిపింది. తనకు 16 ఏళ్లు వచ్చే సరికి తమను వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. ఆ సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించామని చెప్పుకొచ్చింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది