Tuesday, April 30, 2024
- Advertisment -
HomeNewsInternationalAmerica | అమెరికా గగనతలంలో మళ్లీ బెలూన్ కలకలం.. చైనా కవ్వింపు చర్యలేనా !

America | అమెరికా గగనతలంలో మళ్లీ బెలూన్ కలకలం.. చైనా కవ్వింపు చర్యలేనా !

America | అమెరికా గగనతలంలో అనుమానాస్పద వస్తువుల కదలికలు ఇంకా ఆగడం లేదు. ఇప్పటికే రెండుసార్లు అనుమానాస్పద వస్తువులను అమెరికా పేల్చేయగా.. తాజాగా మరో బెలూన్‌ను గుర్తించారు. తెలుపు రంగులో ఉన్న పెద్ద బెలూన్‌ను పైలట్లు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
హవాయిలోని హోనొలులుకు తూర్పువైపులో పెద్ద బెలూన్‌ను గుర్తించామని పైలట్లు పేర్కొన్నారు. ఇది గగనతలానికి సుమారు 40 వేల నుంచి 50 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ కనిపించిందని వారు తెలిపారు. అయితే ఈ ఘటనను యూఎస్‌ అధికారులు మాత్రం కన్ఫర్మ్‌ చేయలేదు. ఈ అనుమానాస్పద వస్తువులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? దాని వల్ల ప్రజలకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా..? అనేది ఇంకా తెలియలేదు.

ఇటీవల కాలంలో యూఎస్‌ గగన తలంలో చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్‌ ను కూల్చేసిన తర్వాత ఇలా వరుసగా అనుమానాస్పద వస్తువులు కనిపించడం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పవచ్చు. విమానాల రాకపోకలకు ఇవి అంతరాయం కలిగిస్తాయనే భావనతో.. అమెరికా వాటిని అత్యాధునిక క్షిపణుల సాయంతో కూల్చేవేసింది. కానీ ఇంతవరకు ఆ వస్తువులు ఏంటి అనేది ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ఇప్పటికే బెలూన్‌ వ్యవహారం పై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇప్పటికే చైనా దౌత్యవేత్త వాంగ్‌ యీ కి వార్నింగ్‌ కూడా ఇచ్చారు. మరోసారి ఇటువంటి బాధ్యతారాహిత్య చర్యలను పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌ సందర్భంగా వీరిద్దరూ సమావేశమయ్యారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News