Ganapati Puja | విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. అందుకే ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయని చెబుతుంటారు. గణేశుడికి బుధవారం అత్యంత ప్రీతికరమైన రోజు. ఇవాళ వినాయకుడిని పూజించడంతో పాటు ఉపవాసం ఉండటం వల్ల పార్వతీ తనయుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. అయితే గణనాథుడిని ఎలా పడితే అలా పూజించకూడదు. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటిస్తేనే వినాయకుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. గణేశుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వినాయకుడికి జమ్మి ( శమీ ) వృక్షం అంటే ఇష్టం. కాబట్టి బుధవారం రోజు గణపతికి జమ్మి మొక్కను సమర్పిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని.. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని పండితులు చెబుతుంటారు.
గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. బుధవారం నాడు పూజ చేసేటప్పుడు గణేశుడికి ఎర్రటి సింధూరం తిలకంగా దిద్దాలి.
గణపతి పూజలో అన్నం చాలా పవిత్రమైనది. పూజా సమయంలో వచ్చిన వారికి బియ్యం దానం చేసిన దానికంటే కూడా అన్నం వండి వడ్డించడం మంచిది. దీనివల్ల విఘ్నేశ్వరుడు సంతోషించి కోరిన కోర్కెలను తీరుస్తాడు.
బుధవారం వినాయకుడికి నెయ్యి, బెల్లం సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.
సాధారణంగా శని పీడిస్తే వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి శని చుట్టుకుంటే అంత తొందరగా వదలడు. అలాంటప్పుడు ప్రతి బుధవారం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన గరికతో పూజ చేయడం వల్ల శని బాధలు తొలగిపోతాయి. జీవితంలో సంతోషం నెలకొంటుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?
Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి
Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !