RK Roja | టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి పంచ్‌లు విసిరారు. బాలయ్య అన్‌స్టాపబుల్ ను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అన్‌స్టాపబుల్ షోకి వెళ్లాలని ముందు నుంచి అనుకున్నా కానీ.. చంద్రబాబు, పవన్ ఎపిసోడ్స్ చూశాక ఆ షోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేలో పాల్గొనాలని తనకు కూడా ఆహ్వానం వచ్చిందని ఆర్కే రోజా వెల్లడించింది. అయితే అప్పుడు రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల షోకు వెళ్లడం కుదరలేదని చెప్పారు. బాలకృష్ణతో తనది హిట్ కాంబినేషన్ అని.. ఇద్దరం కలిసి ఏడు సినిమాల్లో నటించామని తెలిపారు. ఈ షోకు వెళ్లాలని తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండేదని బయటపెట్టారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ పోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత అన్‌స్టాపబుల్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. చనిపోయిన ఎన్టీఆర్‌ను ఫూల్ చేసేలా.. ఆయనకు వెన్నుపోటు పొడవడం కరెక్ట్ అనే విధంగా ఈ షోను ఉపయోగించుకుని రాజకీయం చేయడం తనకు నచ్చలేదని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు తన కొడుక్కి అడ్డదారిలో మంత్రి పదవి కట్టబెట్టడం తప్ప.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఏం చేశారని చంద్రబాబును ఆర్కే రోజా ప్రశ్నించారు. జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని చట్టం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సిగ్గు లేకుండా యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒకరు యువశక్తి, మరొకరు యువగళం పేరుతో వస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర చేసినా.. పవన్ వారాహి అంటూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నాగబాబుపై కూడా రోజా సెటైర్ వేశారు. టూరిజం గురించి కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం చేసిన రోజా.. పొలిటికల్ జోకర్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది