horoscope today | మేషం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. చేపట్టిన పనులను నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.
వృషభం
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో లాభాలు పొందుతారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
మిథునం
కొత్త వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు తీసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లాభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్య పరుస్తాయి.
కర్కాటకం
కుటుంబంలో నెలకొన్న వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలు ఆనందాన్ని కలగజేస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు.
సింహం
రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. ధనలాభం ఉంది.
తుల
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ప్రయాత్నాల్లో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాల విషయంలో మెలకువ అవసరం. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది.
వృశ్చికం
కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు, కాంట్రాక్టులు దక్కుతాయి. పోటీపరీక్షల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.
ధనుస్సు
విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
మకరం
రుణాలు కొంతవరకు తీరుస్తారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. పనుల్లో తొందరపాటు తగదు. జీవిత భాగస్వామి సహాయ హకారాలు అందుతాయి. స్వల్ప ధనలాభం ఉంది.
కుంభం
వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలుగజేస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
మీనం
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం కలదు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుఆతరు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?
Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?