Tuesday, April 30, 2024
- Advertisment -
HomeLatest NewsVirat Kohli | కోహ్లీ మళ్లీ అలాంటి షాట్‌లు ఆడలేడు: పాక్‌ బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Virat Kohli | కోహ్లీ మళ్లీ అలాంటి షాట్‌లు ఆడలేడు: పాక్‌ బౌలర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Virat Kohli | దాయాదీ జట్టు పాకిస్థాన్‌తో పోరు అంటే భారత్‌తో పాటు క్రీడాలోకానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. భారత్, పాక్ మ్యాచ్ వస్తుందంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గతేడాది అక్టోబర్ 23న దాయదీ జట్ల మధ్య జరిగిన పోరు కూడా అలాంటి ఇంట్రెస్ట్‌నే క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్‌ను క్రీడాలోకం ఎప్పటికీ మరిచిపోదు. ఓటమి ఖాయమని అనుకున్న టైమ్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. అనితరసాధ్యమైన ఆటతో మ్యాచ్‌ మొత్తాన్ని తిప్పేశాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆశలు ఆవిరైన స్థితిలో ఓ చుక్కానిలా జట్టును ముందుండి నడిపించాడు. 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటి చేత్తో భారత్‌ను గెలిపించాడు. మునివేళ్లపై నిలబెట్టిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ 19వ ఓవర్‌లో కొట్టిన రెండు సిక్స్‌లే హైలెట్‌. ఉత్కంఠ భరితంగా సాగుతున్న తరుణంలో హరీస్‌ రవూఫ్‌ బౌలింగ్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి ఒక్కసారిగా మ్యాచ్‌ను భారత్‌ వైపు మళ్లించి గెలిపించాడు. దీంతో కోహ్లీ ఆటతీరుకు దాసోహమైన క్రీడా ప్రపంచం అతడిని వేనోళ్లా పొగిడింది. అంతటి చరిత్ర ఉన్న ఆ మ్యాచ్‌కు సంబంధించి పాక్‌ బౌలర్‌ రవూఫ్‌ మరోసారి మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చుకున్నాడు.

ఓ పాపులర్ పాక్‌ టెలివిజన్‌ షోలో పాల్గొన్న హరీస్‌ రవూఫ్‌ ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆ మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌లో అలాంటి షాట్లు చాలా అరుదు అని పేర్కొన్నాడు. కోహ్లీ సైతం మరోసారి అలాంటి షాట్‌ ఆడలేడన్నాడు. ‘‘ఆ క్లిష్ట సమయంలో కోహ్లీ సిక్స్‌ కొట్టడంతో చాలా బాధేసింది. ఆ సంఘటన గురించి నేనేం మాట్లాడను కానీ వ్యక్తిగతంగా నన్ను చాలా బాధించింది. ఆ సమయంలో ఏదో తప్పు జరిగింది అనిపించింది. క్రికెట్‌ గురించి తెలిసిన ఎవరికైనా కోహ్లీ ఎలా ఆడతాడో తెలుసు. ఒకవేళ కోహ్లీ మళ్లీ అలా ఆడమంటే ఆడలేడు. అలాంటివి క్రికెట్‌లో చాలా అరుదైనవి. మళ్లీ మళ్లీ అలాంటి షాట్‌లను ఆడలేం. ఆ సమయంలో కోహ్లీ టైమింగ్‌ సూపర్‌. దాంతో ఆ బాల్‌ స్టాండ్స్‌లోకి నేరుగా వెళ్లింది’’ అని రవూఫ్‌ తన బాధను పంచుకున్నాడు.

ప్రస్తుతం భారత్‌ స్వదేశంలో శ్రీలంకతో వన్డే పోరుకు సిద్ధమవుతోంది. రేపటి(జనవరి 10) నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇటీవల లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ పాల్గొనలేదు. మూడు టీ20ల పోరులో భారత్‌ 2-1 తేడాతో ట్రోఫీని నెగ్గిన విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

MMA Fighter Victoria | 18 ఏళ్లకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ హఠాన్మరణం.. కారణమేంటో?

Surya Kumar Yadav | భారతీయుడు కావడం అతని అదృష్టం.. మా దేశంలో పుట్టి ఉంటే.. పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

India Vs Srilanka | 45 బంతుల్లో సూర్య కుమార్ సెంచరీ.. లంక బౌలర్లను శతక్కొట్టాడు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News