Thursday, June 1, 2023
- Advertisment -
HomeLatest NewsIndia Vs Srilanka | 45 బంతుల్లో సూర్య కుమార్ సెంచరీ.. లంక బౌలర్లను శతక్కొట్టాడు

India Vs Srilanka | 45 బంతుల్లో సూర్య కుమార్ సెంచరీ.. లంక బౌలర్లను శతక్కొట్టాడు

India Vs Srilanka | శ్రీలంకతో జరుగుతున్న మూడో 20లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ( Surya kumar Yadav ) చెలరేగిపోయాడు. 45 బంతుల్లోనే రికార్డు సెంచరీ చేశాడు. మొత్తం మీద ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 51 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20లో ఇది సూర్యకుమార్‌కు మూడో సెంచరీ. ఇందులో 9 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. భారత్ తరఫున ఇది టీ20లో రెండో వేగవంతమైన సెంచరీ. భారత్ తరఫున రెండు వేగవంతమైన సెంచరీలు శ్రీలంకపైనే కావడం విశేషం. గతంలో రోహిత్ శర్మ 35 బంతుల్లో శ్రీలంకపై సెంచరీ చేశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. అయితే సూర్యకుమార్‌తో పాటు శుభమన్ గిల్ చెలరేగి ఆడటంతో శ్రీలంక ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి నిరాశ పరిచాడు. రాహుల్ త్రిపాఠి 35 పరుగులు, హర్ధిక్ పాండ్యా, దీపక్ హుడా 4, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. అక్షర్ పటేల్, సూర్యకుమార్‌ ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Lionel Messi | ధోనీ కూతురికి మెస్సీ స్పెషల్‌ గిఫ్ట్‌.. అది చూసి మురిసిపోతున్న జీవా

Cristiano Ronaldo | రొనాల్డోకు రోల్స్ రాయల్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియసి.. కారణం ఏంటంటే..

Chudamani temple | ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారట.. వందల ఏళ్లుగా భక్తుల విశ్వాసం.. ఎక్కడ ఉంది ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News