Bigg Boss Telugu season 6 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. సెప్టెంబర్ 4వ తేదీన మొదలైన ఈ సీజన్ 105 రోజులపాటు కొనసాగింది. మొత్తం వివిధ రంగాలకు చెందిన 21 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ 6లో పాల్గొనగా.. సింగర్ రేవంత్ ( Revanth ) విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో చివరివరకు రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ టాప్ 5లో నిలిచారు. అయితే వీరిలో ముందుగా రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. చివరగా శ్రీహాన్, రేవంత్ ఇద్దరే టైటిల్ పోరులో నిలిచారు.
ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. గోల్డెన్ బాక్స్‌తో హౌస్‌లోకి వచ్చిన నాగార్జును శ్రీహాన్, రేవంత్‌కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ప్రైజ్ మనీలో సగం డబ్బు తీసుకొని ఇద్దరిలో ఒకరు బయటకు పోవచ్చని ప్రకటించాడు. కానీ ఇద్దరూ ఒప్పుకోలేదు. టైటిల్ కోసం వేచి చూశారు. కానీ ఇద్దరిలో బయటకు వెళ్లే ఒకరికి 30 లక్షలు ఇస్తానంటూ మరో ఆఫర్ ఇచ్చాడు . అయినే ఇద్దరూ టైటిల్ కోసమే నిలబడ్డారు. చివరకు ఆ మొత్తాన్ని రూ.40 లక్షలకు పెంచడంతో శ్రీహాన్ బయటకు వచ్చేశాడు. దీంతో బిగ్‌బాస్ విజేతగా రేవంత్ నిలిచాడు. బిగ్‌బాస్ సీజన్ 6లో ట్రోఫీ గెలుచుకున్నాడు. అయితే ప్రైజ్ మనీ మాత్రం కేవలం రూ.10 లక్షలే దక్కింది. రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్‌కు మాత్రం రూ.40లక్షలు దక్కాయి. అంటే విజేత కంటే రన్నరప్ ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడన్నమాట.
కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో పలువురు సినీ తారలు వేదికపై తళుక్కుమని మెరిశారు. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, అలియాభట్, టాలీవుడ్ నటులు సుదీర్‌బాబు,
కృతి శెట్టి, అమల, శర్వానంద్, తమన్నా, రితికా సింగ్, శ్రద్ధాదాస్, సోనాల్ చౌహాన్, ప్రవీన్ సత్తారు, శ్రావణి భార్గవి, దేవిశ్రీ ప్రసాద్, అవికా గోర్, అంజలీ, రష్మి, హైపర్ ఆది, కార్తి, శివ బాలాజీ, అడవి శేష్, తదితరులు బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి హౌస్‌మేట్స్‌తో ముచ్చటించి.. సీజన్ 6కి కొత్త లుక్ తీసుకొచ్చారు.
Read More Articles |
Ramya | అప్పుడు సమంత.. ఇప్పుడు దీపిక.. కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు.. మండిపడ్డ హీరోయిన్
Sreeleela | హైదరాబాద్‌లో సినిమా టికెట్లు అమ్మిన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల
Atlee kumar | పెళ్లయిన 8 ఏళ్లకు తల్లిదండ్రులు అవుతున్న మరో సెలబ్రెటీ కపుల్
Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?