Wednesday, April 24, 2024
- Advertisment -
HomeNewsInternationalFIFA World cup | ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకు దక్కే ప్రైజ్ మనీ...

FIFA World cup | ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకు దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. గెలిచిన జట్టుకు నకిలీ ట్రోఫీనే ఇస్తారట.. కారణమిదే !

FIFA World cup | ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో నరాలు తెగే ఉత్కంట మధ్య అర్జెంటీనా మూడోసారి విశ్వవిజేతగా అవతరించింది. అర్జెంటీనా ( Argentina ), ఫ్రాన్స్ ( France ) మధ్య జరిగిన హోరోహోరి పోరులో చివరికి అర్జెంటీనానే విజయం వరించింది. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్‌ కిరీటాన్ని చేజిక్కించుకుంది. విశ్వవిజేతగా ( FIFA World cup winner ) అవతరించింది. ప్రపంచకప్ ఫలితం అయితే తేలింది.. కానీ గెలిచిన టీమ్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందనే విషయంలో మాత్రం అందరికీ ఆసక్తి ఉంది. ఇంతకీ గెలిచిన వారికి వచ్చే ప్రైజ్ మనీ ఎంత.. ఓడిన టీమ్ దక్కే బహుమతి ఏంటో ఓసారి లుక్కేయండి మరి..

టాప్ 4 జట్లకు దక్కే ప్రైజ్ మనీ ( prize money ) ఇదే..

ఫిఫా వరల్డ్‌కప్ విజేతతో పాటు టాప్ 4 జట్లకు ప్రైజ్ మనీ ( prize money ) దక్కుతుంది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 347 కోట్ల రూపాయలు దక్కనుంది. అంటే ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన అర్జెంటీనాకు రూ.347 కోట్లు దక్కాయి. అటు రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు రూ.248 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియాకు రూ.223 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో జట్టుకు కూడా భారీగానే ప్రైజ్ మనీ వరించింది. ఆ టీంకు 206 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ దక్కింది. అంటే టాప్ 4 జట్లకు దక్కే మొత్తం ప్రైజ్ మనీ రూ.1024 కోట్లన్నమాట.

ప్రపంచకప్ గెలిచినా దక్కేది నకిలీ ట్రోఫీనే..

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు అందజేసే ట్రోఫీ విషయం ఆసక్తికరంగా ఉంటుంది. విశ్వవిజేతగా అవతరించిన జట్టు సంబరాలు చేసుకునేందుకు మాత్రమే అసలు ట్రోఫీని అందజేస్తారట. అవార్డుల ప్రధానోత్సవం ముగిసిన తర్వాత.. గెలిచిన జట్టు సంబరాలు చేసుకోవడం పూర్తవగానే అసలు ట్రోఫీని ఫిఫా అధికారులు వెనక్కి తీసుకుంటారు. అదేంటి.. మరి ట్రోఫీ సంగతేంటనుకుంటున్నారు. దాని స్థానంలో విజేత జట్టుకు డూప్లికేట్ ట్రోఫీ అందజేస్తారు. దీన్ని కాంస్యంతో తయారు చేసి బంగారు పూత పూస్తారు. గత సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకు అసలు ట్రోఫీకి బదులు డూప్లికేట్ ట్రోఫీనే అందజేశారన్నమాట. 2005 నుంచి అసలు ట్రోఫీని గెలిచిన జట్టు తమ దేశానికి తీసుకెళ్లడానికి అనుమతించడం లేదు. దీనిపై ఫిఫా తీర్మానం కూడా చేసింది. ఫిఫా ప్రపంచకప్ అసలు ట్రోఫీ జ్యూరీచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలోనే ఉంటుంది.

FIFA World cup ట్రోఫీ బరువు ఇదే..

ఫిఫా ప్రపంచకప్ ట్రోపీ బరువు దాదాపు 6.175 కిలోలు ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేస్తారు. ఇందులో 75 శాతం బంగారమే ఉంటుంది. ట్రోఫీ పొడవు 36.8 సెంటీమీటర్లు ఉండగా.. ఉపరితల వ్యాసం 13 సెంటీమీటర్లే. ట్రోఫీ పునాదిపై మలాకైట్ రాయి రెండు పొరలుగా అమర్చి ఉంటుంది. అయితే 1994లో ట్రోఫీలో స్వల్ప మార్పులు చేశారు. గెలిచిన జట్టు పేరు రాసేందుకు వీలుగా ట్రోఫీ దిగువ భాగంలో ఒక ప్లేట్ ఉంచారు.

Follow Us : FacebookTwitter

Read more articles |

FIFA World cup 2022 | నెరవేరిన మెస్సీ కల.. ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం.. విశ్వవిజేతగా అర్జెంటీనా

ODI world cup | 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్ నుంచి తరలిపోనుందా.. కారణమిదేనా?

Lionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్‌.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సంచలన ప్రకటన

Sania – shoaib malik divorce rumours | సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి ఆమే కారణమా? షోయబ్ తాజా వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?

Arjun Tendulkar | తండ్రికి తగ్గ తనయుడు.. రంజీ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన అర్జున్‌ టెండూల్కర్‌

ODI world cup | 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్ నుంచి తరలిపోనుందా.. కారణమిదేనా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News