Avatar 2 | ఆ యువకుడిది అందమైన కుటుంబం. భార్య, కూతురు, కొడుకుతో జీవితం హాయిగా సాగిపోతుంది. కానీ అంతలోనే ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఒంటరిగా వదిలేసి యువకుడు వెళ్లిపోయాడు. సినిమాకు అని సరదాగా ఇంట్లో నుంచి వెళ్లి విగతజీవిగా ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయం తెలిసిన భార్య, పిల్లల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు పిల్లలను అనాథను చేసి వెళ్లిపోయాడంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కాకినాడ జిల్లాలోని పెద్దాపురంకు చెందిన లక్ష్మిరెడ్డి శ్రీను ( 37 ), తన సోదరుడు రాజుతో కలిసి అవతార్ 2 సినిమా చూడటానికి వెళ్లాడు. పెద్దాపురంలోని ఓ థియేటర్లో సినిమా చూస్తున్న సమయంలో శ్రీను గుండెపోటు వచ్చింది. సీటులో హాయిగా సీనిమా చూస్తున్న శ్రీను ఒక్కసారిగా నొప్పితో కుప్పకూలిపోవడంతో సోదరుడు షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. సోదరుడి ప్రయత్నం విఫలమైంది. శ్రీనును పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు చెప్పారు. గతంలో అవతార్ మొదటి పార్టు విడుదలైనప్పుడు కూడా తైవాన్లో ఓ వ్యక్తి థియేటర్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
Read More Articles |
Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?
Macherla | రణరంగంగా మారిన మాచర్ల.. టీడీపీ, వైసీపీ శ్రేణుల వీరంగంతో హైటెన్షన్..