Saturday, May 4, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowRoanoke mystery | ఊరుకు ఊరే మాయమైంది.. అక్కడి జనం ఏమైపోయారో ఇప్పటికీ మిస్టరీనే !!

Roanoke mystery | ఊరుకు ఊరే మాయమైంది.. అక్కడి జనం ఏమైపోయారో ఇప్పటికీ మిస్టరీనే !!

Roanoke mystery | ఊరు ఊరంతా మాయమైపోయింది. అక్కడ ఉన్న 115 మంది కనిపించకుండాపోయారు. వాళ్ల నాయకుడు పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఒక్క మనిషి ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. వందల ఏండ్లు గడుస్తున్నా వాళ్ల అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. వాళ్లే ఎక్కడికైనా వెళ్లిపోయారా? ఏలియన్స్ మింగేశాయా? అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉండిపోయింది.

అది చాలా ఏండ్ల కిందటి ముచ్చట ! ప్రపంచంలోని అన్ని దేశాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని బ్రిటీషోళ్లు ఉవ్విళ్లూరుతున్న సమయం అది. ఇంగ్లండ్ నుంచి నాలుగు దిక్కులూ వెళ్లి అక్కడి అధికారాన్ని లాక్కోవడంతో పాటు కొత్త ప్రాంతాలను వెతికేందుకు ప్రత్యేకంగా కొన్ని బృందాలు సముద్ర మార్గంలో వెళ్లారు.అలా చాలా ప్రాంతాలను ఆంగ్లేయులు కనుగొన్నారు. ఈ ప్రక్రియలోనే 1587లో జాన్ వైట్ ఒక ఐల్యాండ్‌ను కొనుగొన్నాడు . అమెరికా తూర్పు తీరంలో కనుగొన్న ఆ ఐల్యాండ్ పేరు రోనెకే. తనతో పాటు 115 మందితో ప్రయాణం చేసి జాన్ వైట్ ఆ ద్వీపాన్ని కనుగొన్నాడు. అక్కడే తన వాళ్లతో ఒక కాలనీని ఏర్పాటు చేసుకున్నాడు. కొద్దిరోజులు అక్కడే ఉన్నాడు. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే తమ వద్ద ఉన్న సరుకులు, ఆహార పదార్థాలు సరిపోవు. పైగా ఆ ప్రాంతం తమ ఆధీనంలో ఉంచుకోవడానికి మరికొంతమంది సిబ్బంది అవసరం కూడా ఉంది. దీంతో జాన్ వైట్ మళ్లీ ఐంగ్లాండ్ బయల్దేరాడు. ఐంగ్లాండ్ వెళ్లేటప్పుడు సముద్రపు దొంగలు దాడి చేసి ఓడ లాక్కున్నారు. దీంతో లండన్ వెళ్లేందుకు జాన్ వైట్‌కు చాలా రోజులు పట్టింది. అక్కడికి వెళ్లాక తొందరగా తిరిగి వద్దామంటే వరుస తుఫాన్లు. దీంతో రోనేకేకి తిరిగి రావడానికి మూడేళ్లు పట్టింది.

మూడేళ్లలో ఏం జరిగింది?

ఆ మూడేళ్లలో జాన్ వైట్ ధ్యాస అంత ఆ ద్వీపం మీదనే ఉండేది. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తానా అని ఎదురుచూసేవాడు. ఎందుకంటే అతని భార్య, కూతురు, అల్లుడు ఆ ఐలాండ్‌లోనే ఉండిపోయారు. వాళ్లు ఆ ద్వీపానికి వెళ్లిన తర్వాత అతనికి మనుమరాలు కూడా పుట్టింది. ఆమెతో ఎక్కువ రోజులు గడపకపోవడంతో తన మనమరాలితో ఆడుకోవాలని చాలా ఆశపడ్డాడు. కానీ ఇంగ్లండ్ నుంచి తిరిగి వెళ్లేందుకు జాన్ వైట్‌కు మూడేళ్ల సమయం పట్టింది. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆ ఐలాండ్‌లో ఎవరూ కనిపించలేదు. ఆ చుట్టు పక్కల ఎక్కడ వెతికినా ఒక్క ఆనవాలు కూడా దొరకలేదు. దీంతో తన వాళ్లంతా ఏమైపోయారని మదనపడిపోతుంటే అక్కడి ఒక చెట్టుపై క్రోటోవాన్ ( CROATOAN ) అని, మరో చెట్టుపై సీఆర్‌వో అని రాసి ఉండటం కనబడింది.

ఆ అక్షరాల అర్థమేంటి?

రోనోకే నుంచి ఇంగ్లండ్ తిరిగి వెళ్లేటప్పుడు తన సిబ్బందికి జాన్ వైట్ ఒక సూచన చేశాడు. ఏదైనా సమస్య ఎదురైతే అందరూ కలిసి వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లాలని.. అలా వెళ్లినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో ఆ సమాచారాన్ని అక్కడే ఉన్న చెట్లపై చెక్కాలని కండీషన్ పెట్టాడు. అది గుర్తొచ్చిన జాన్ క్రోటోవాన్ ఎక్కడా అని వెతికాడు. అది తను ఉన్న ఐలాండ్‌కు 60 మైళ్ల దూరంలో ఉంది. దీంతో అందరూ అక్కడికే వెళ్లి ఉంటారని భావించి క్రోటోవాన్ వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ ఈదురుగాలులు, తుఫాన్లు రావడంతో వెళ్లలేకపోయాడు. కొద్దిరోజులు ఆగిన తర్వాత మళ్లీ క్రోటోవాన్‌కు బయల్దేరాడు. కానీ మళ్లీ అదే పరిస్థితి. దీంతో తిరిగి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. తన కుటుంబం ఏమైందో అని మదనపడుతూ.. మూడేండ్లకు కన్నుమూశాడు.

వాళ్లకు ఏమైంది?

జాన్ వైట్ మరణించిన తర్వాత కూడా కనిపించకుండా పోయిన 115 మంది కోసం చాలామంది వెతికారు. కానీ వాళ్ల ఆచూకీ ఎక్కడా దొరకలేదు. దీంతో వాళ్లు మాయం కావడం వెనుక ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. న్ వైట్ తన సిబ్బంది రోనోకే రావడానికి ముందు కొంతమంది బ్రిటీషర్స్ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారిని అక్కడ చుట్టుపక్కల ఉండే అమెరికన్స్ అడ్డుకున్నారు. వాళ్లే జాన్ వైట్‌కు సంబంధించిన 115 మందిని చంపేసి ఉంటారని కొంతమంది భావించారు. అమెరికన్స్ దాడి చేసి ఉంటే అక్కడ గొడవలు జరిగినట్టు ఆనవాళ్లు దొరికేవి. కానీ అక్కడ ఎలాంటి అవశేషాలు లభించలేదు.జాన్ వైట్ మూడేళ్లు తిరిగి రాలేదు కాబట్టి కావాల్సినంత ఆహారం లేక ఎక్కడికైనా వెళ్లి ఉంటారని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. కానీ అందుకు కూడా ఆధారాలు దొరకలేవు.

ఏలియన్స్ ఎత్తుకెళ్లాయా?

ఒక్కసారిగా 115 మంది మాయమయ్యారంటే అది మామూలు విషయం కాదు. వేరే తెగల వాళ్లు దాడి చేస్తే కనీసం అక్కడ చిన్న ఆధారమైనా దొరికేది. కానీ అక్కడ ఏవీ దొరకలేవు అంటే మనుషుల కంటే పెద్ద శక్తి ఏదో దాడి చేసి ఉంటుందనే వాదనలు వినిపించాయి. ఏలియన్స్ దాడి చేసి ఉండొచ్చనే ప్రచారం కూడా జరిగింది. కానీ వాళ్లకు ఏమైందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. 2020లో కొంతమంది ఆర్కియాలజిస్టులు క్రోటోవాన్ ( ప్రస్తుతం హట్టేరాస్ )లో రీసెర్చ్ చేసినప్పుడు ఇంగ్లండ్‌లో వాడే వస్తువులు కనిపించాయి. వాటిని హట్టేరాస్ వాసులు తమ పూర్వీకులకు సంబంధించిన ఆయుధాలు అని వాదించారు. అయితే అవి జాన్ వైట్ సిబ్బందికి సంబంధించినవే అని చెప్పే ఆధారాలు మాత్రం దొరకలేదు. దీంతో జాన్ వైట్ కుటుంబం అదృశ్యం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Water Falls in AP | ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ జలపాతాలు ఇవి.. ఇందులో ఐదో జలపాతం వద్ద శివపార్వతులు ధ్యానం చేశారట

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News