Vasishta simha and Haripriya Engagement | మరో సెలబ్రెటీ కపుల్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. కేజీఎఫ్ ( KGF ) నటుడు వశిష్ఠ సింహాతో హీరోయిన్ హరిప్రియ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇరుకుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలను వశిష్ఠ తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ” మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా ఎంగేజ్మెంట్ జరిగింది. మీ ఆశీస్సులు అందించండి” అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు సెలబ్రెటీ కపుల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన జై సింహా సినిమాకు వశిష్ఠ, హరిప్రియ కలిసి పనిచేశారు. ఆ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలవడంతో అదికాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో వశిష్ట, హరిప్రియ తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించేందుకు సిద్దమయ్యారు
కర్ణాటకకు చెందిన హరిప్రియ తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా వంటి సినిమాల్లో నటించింది. కానీ అంతగా పేరు రాలేదు. కానీ కన్నడలో మాత్రం ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ఉగ్రమ్, రన్న, రిక్కీ, సంహారా, బెల్ బాటమ్ వంటి చిత్రాలతో అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వశిష్ఠ విషయానికొస్తే ఆర్య లవ్ సినిమాతో సినిమాల్లోకి వచ్చాడు. రాజా హులి, రుద్ర తాండవ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెప్పించాడు. కేజీఎఫ్ సినిమాలో విలన్ పాత్ర పోషించి పాపులర్ అయ్యాడు.
Read More Articles |
Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్ అంత ఎమోషన్‌గా సాగిందా?
Theri Remake | మాకొద్దు బాబోయ్ ఆ రీమేక్.. పవన్ కళ్యాణ్ సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన