తెలంగాణలో మరో 4 రోజులు భారీ వానలు

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్, సంగారెడ్డిలో వడగండ్లు పడ్డాయి.

నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

17వ తేదీన నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.

సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌లో కూడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

18న జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.