Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsMohemmad siraj | ధోనీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సిరాజ్‌

Mohemmad siraj | ధోనీ రికార్డ్‌ బ్రేక్‌ చేసిన సిరాజ్‌

Mohemmad siraj | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: అదేంటి బ్యాటింగ్‌ దిగ్గజాల్లో ఒకడైన మహేంద్రసింగ్‌ ధోనీ రికార్డును పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ బద్దలు కొట్టడం ఏంటి అని అనుకుంటున్నారా! నిజమేనండీ.. దేశానికి రెండు ప్రపంచకప్‌లు సహా ఎన్నో అద్వితీయ విజయాలు అందించిన జార్ఖండ్‌ డైనమైట్‌ ధోనీ రికార్డును హైదరాబాదీ సిరాజ్‌ బ్రేక్‌ చేశాడు. అయితే అది బ్యాటింగ్‌లోనో లేక బౌలింగ్‌లోనో కాదు! ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అనతి కాలంలోనే అగ్రస్థానం పొందడంలో. జాతీయ జట్టులోకి వచ్చీ రావడంతోనే మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడిన మహేంద్ర సింగ్‌ ధోనీ 2006లో ఐసీసీ వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అధిరోహించాడు. అరంగేట్రం చేసిన 31 మ్యాచ్‌ల అనంతరం మహీ టాప్‌ ప్లేస్‌ కైవసం చేసుకోగా.. తాజాగా బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహమ్మద్‌ సిరాజ్‌ అంతకంటే తక్కువ (21) మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల్లో తన వేగంతో ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించిన ఈ హైదరాబాదీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్‌ ఆరంభంలో వేగం ఉన్నా నియంత్రణలేక భారీగా పరుగులు సమర్పించుకుంటూ విమర్శల పాలైన సిరాజ్‌.. ఇప్పుడు తన బలహీనతలను అధిగమించి పిచ్‌తో సంబంధం లేకుండా వీరవిహారం చేస్తున్నాడు.

నాలుగేండ్ల క్రితమే వన్డే అరంగేట్రం చేసిన మహమ్మద్‌ సిరాజ్‌.. తొలి మ్యాచ్‌ తర్వాత తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు దాదాపు రెండేండ్ల సమయం పట్టగా.. గతేడాదిగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ హైదరాబాదీ హవా కొనసాగుతోంది. ప్రధాన పేసర్లు అందుబాటులో లేని సమయంలో జట్టులోకి వస్తూ పోతూ ఉన్న సిరాజ్‌.. గతేడాది నిలకడగా రాణించి టీమిండియా తరఫున అత్యధిక వన్డే వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాదిలోనూ అదే జోరు కొనసాగించిన సిరాజ్‌.. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దుమ్మురేపాడు.

పవర్‌ప్లే అటాకర్‌..

కెరీర్‌ తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శల పాలైన సిరాజ్‌.. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవలనే చందంగా.. అహర్నిశలు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో పుట్టి.. టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ ఆటోడ్రైవర్‌ కుమారుడు.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. ఐపీఎల్‌ మెరుపులతో జాతీయ జట్టులోకి వచ్చిన సిరీజ్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. టెస్టుల్లో నమ్మదగ్గ బౌలర్‌గా పేరు సంపాదించుకున్నాడు. ఈ దశలో ఆస్ట్రేలియా పర్యటన అతడి కెరీర్‌ను మార్చేసింది. కరోనా కష్టకాలంలో భారత్‌, ఆసీస్‌ మధ్య జరిగిన ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ సందర్భంగా సిరాజ్‌ తండ్రి మృతి చెందారు. అయితే కొవిడ్‌-19 ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం కంటే.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే పెద్దదనుకున్న సిరాజ్‌.. కన్నతండ్రి కడచూపునకు కూడా నోచుకోలేదు. అతడి ఈ త్యాగం ఫలించింది. ఆ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తన పేస్‌, స్వింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెడుతూ వచ్చిన సిరాజ్‌ ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరి శభాష్‌ అనిపించుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది


RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News