Monday, March 27, 2023
- Advertisment -
HomeLatest NewsWashington Sunder | బిర్యానీ లేదని వేరే రెస్టారెంట్ కు వెళ్తారా.. కివీస్‌తో ఓటమిపై వాషింగ్టన్‌...

Washington Sunder | బిర్యానీ లేదని వేరే రెస్టారెంట్ కు వెళ్తారా.. కివీస్‌తో ఓటమిపై వాషింగ్టన్‌ సుందర్‌ రియాక్షన్‌

Washington Sunder | న్యూజిలాండ్ పై తొలి టీ 20 మ్యాచ్ లో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో టాప్ ఆర్డర్ విఫలం కావడం గురించి సర్వత్రా విమర్శలు రేగాయి. దీంతో అసలు మొత్తానికే టాప్ ఆర్డర్ నే మార్చాయలనే విమర్శలు వినిపించాయి. దీని గురించి టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ సూటిగా సమాధానమిచ్చాడు.

మూడు టీ20ల న్యూజిలాండ్ 1-0 అధిక్యంలో ఉంది. రెండు వైపులా.. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సుందర్ రాణించినా విజయం మాత్రం టీమ్ ఇండియా దగ్గరకు రాలేదు. హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ మాత్రమే తన బౌలింగ్ లో ప్రత్యర్థి జట్టులోని రెండు కీలకమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీని గురించి సుందర్ మాట్లాడుతూ… దీనిని కేవలం ఒక మ్యాచ్ గానే పరిగణిస్తానని, ఓటమి నుంచి త్వరగానే పాఠాలు కూడా నేర్చుకుంటామని పేర్కొన్నాడు. కెప్టెన్ పాండ్యా చెప్పినట్లుగా రాంచీ పిచ్ మమ్మల్ని ఆశ్చర్యానికి లోనూ చేసింది. బంతి కూడా తెగ తిరిగేసింది. అయితే మేం ఆ సమస్యను త్వరగానే పరిష్కరించుకొంటాం. కేవలం ఇది ఒక మ్యాచ్ మాత్రమే. పరుగుల లక్ష్యఛేదనలో మంచి ప్రారంభం లభించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇలాంటి పిచ్ పై ఆడటం అంతా సులభమేమి కాదు. స్పిన్నర్లు ఎక్కువగానే వికెట్టు తీశారు. ఇలాంటి పిచ్ మీద మన ఆటగాళ్లు చాలాసార్లు ఆడారని పేర్కొన్నాడు. సుందర్ చెప్ని అంశాల గురించి జర్నలిస్టులు పలు ప్రశ్నలు సంధించారు.

టాప్ ఆర్డర్ ను మార్చాల్సిన అవసరం ఉందని ఓ పాత్రికేయుడు ప్రస్తావించగా.. సుందర్ దానికి అద్భుతంగా బదులిచ్చాడు. నిజంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తుందాంటారా? ఒక రోజు మీకిష్టమైన బిర్యానీ ఓ రెస్టారెంట్ లో దొరకకపోతే.. ఇక నుంచి మీరు ఆ రెస్టారెంట్ కి వెళ్లకుండా ఉంటారా? ఇప్పుడు మీరు మార్చాలి అంటున్న ఆటగాళ్లు భారీగా పరుగులు చేసినవారే. ఏదో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగింది. న్యూజిలాండ్ కూడా ఇలానే రాయ్ పూర్లో 108 పరుగులకే కుప్పకూలింది. దీనివల్ల వారి టాప్ ఆర్డర్ ను మార్చాలని కాదు కదా. ఆటలో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. ఓర్పుగా ఉండాల్సి ఉంటుంది. ఆట అన్నాక ఏదో ఒక జట్టే విజయం సాధిస్తుంది. 22 మంది ఆటగాళ్లూ ఒకేలా ప్రదర్శన ఇవ్వలేరు. త్వరలోనే అర్ష్‌దీప్ కూడా త్వరలోనే గాడిలో పడతాడు. ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. మాలిక్ లాంటి వారు చాలా అరుదైన బౌలర్లు. 150 కి.మీ వేగంతో బంతిని సంధించడమంటే అంతా ఆషామాషీ కాదు అంటూ వాషింగ్టన్ పేర్కొన్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News